News
దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, జూన్ 11 (బీబీఎంఏ న్యూస్):
పోలీస్ అధికారులు ప్రజల ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ నిర్వహించి బాధితులకు నమ్మకం, భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం మంచిర్యాల జోన్ పరిధిలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, ఐటీ విభాగం పనితీరును పరిశీలించిన సీపీ, సిబ్బందితో మాట్లాడి విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ గంగారాం వద్ద స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, ఇతర పరిపాలనా అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదు కోసం వచ్చే ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రతి కానిస్టేబుల్ తన పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పెండింగ్ లేకుండా నిర్వహించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News
ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
హైదరాబాద్ ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడు పులి కృష్ణ కుటుంబానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం రాష్ట్ర కమిటీ రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన పులి కృష్ణ గత జూన్ 29న మూడో అంతస్తులో తడకల పందిరి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఘటన అనంతరం సంఘం నాయకులు స్పందించి కార్యక్రమ నిర్వాహకులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నందికంటి చంద్రశేఖర్, ప్యారసాని ఈశ్వర్, అంగల్ల శ్రీనివాస్, అంగల్ల సంపత్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డెకరేషన్ వృత్తిదారుల సంక్షేమం కోసం అందరూ సంఘంలో సభ్యులుగా చేరి లేబర్ కార్డులు పొందాలని, ప్రమాద బీమా, సంక్షేమ పథకాల సాధనకు సంఘం మరింత బలోపేతం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
News
మున్సిపల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
News
చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra5 days agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News4 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
