Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

మున్సిపల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Published

on

ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మున్సిపల్ కమిషనర్లతో అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.

మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వీధి దీపాలు లేని ప్రాంతాలను గుర్తించి వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. దోమల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన నీటి ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరాభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.

అలాగే, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పన్ను బకాయిలను 100 శాతం వసూలు చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం

Published

on

హైదరాబాద్ ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడు పులి కృష్ణ కుటుంబానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం రాష్ట్ర కమిటీ రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన పులి కృష్ణ గత జూన్ 29న మూడో అంతస్తులో తడకల పందిరి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఘటన అనంతరం సంఘం నాయకులు స్పందించి కార్యక్రమ నిర్వాహకులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నందికంటి చంద్రశేఖర్, ప్యారసాని ఈశ్వర్, అంగల్ల శ్రీనివాస్, అంగల్ల సంపత్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డెకరేషన్ వృత్తిదారుల సంక్షేమం కోసం అందరూ సంఘంలో సభ్యులుగా చేరి లేబర్ కార్డులు పొందాలని, ప్రమాద బీమా, సంక్షేమ పథకాల సాధనకు సంఘం మరింత బలోపేతం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Continue Reading

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending