Telangana
కొత్తగూడెంలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఘన స్వాగతం
కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలం పరిధిలోని సింగభూపాలెం, కొత్త అంజనాపురం, రూప్లా తండాల్లో రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించి, పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు.
అర్ధరాత్రి వేళ అయినప్పటికీ భారీ సంఖ్యలో తరలివచ్చిన గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, గులాబీ జెండా ప్రజల ఆశీస్సులతో ఎల్లప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
రామగుండం కార్పొరేషన్‌లో అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి: కార్పొరేటర్ మార్యపురి సూర్య
మాస్టర్ ప్లాన్ ప్రకటించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు అవినీతి అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక భాస్కరరావు భవన్‌లో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధికి అధికారుల పాత్ర కీలకమైనప్పటికీ, ప్రస్తుతం సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. 60 డివిజన్లకు అవసరమైన 257 పోస్టుల్లో కేవలం 113 మంది మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, 144 పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ప్రజలకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు.
ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాటు, డీఈలు, ఏఈల కొరత కారణంగా అభివృద్ధి పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. అలాగే పబ్లిక్ హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో పరిపాలన దెబ్బతింటోందన్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలపై విజిలెన్స్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రామగుండంలో మాస్టర్ ప్లాన్‌ను ముందుగా ప్రజలకు వెల్లడించి, రహదారుల వెడల్పు, అభివృద్ధి ప్రణాళికపై స్పష్టత ఇచ్చిన తర్వాతే నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేస్తే సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, ఆశాల రమ, శనిగరపు చంద్రశేఖర్, సిరిసిల్ల మల్లేష్, కౌన్సిల్ సభ్యులు రాణవేణి సుధీర్ కుమార్, ఆశాల నవీన్, సాదుల శివ, అబ్దుల్ కరీం, తిరుమల, నాయకులు పోతరాజు నాగరాజు, అనూప్ సాయి, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
News
ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు హెల్ప్‌లైన్.. 040-24603572 ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కాల్‌సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో 040-24603572 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన మంత్రి, ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. రూ.10 వేల EMDని UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, ఇల్లు కేటాయించబడకపోతే అదే బ్యాంకు ఖాతాకు మొత్తం తిరిగి జమ అవుతుందని స్పష్టం చేశారు.
క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తూ, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండి, సొంత ఇల్లు లేదా స్థలం లేని కుటుంబాలు అర్హులని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు స్వీకరిస్తామని, అవసరమైతే పారదర్శక లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.
ఈ పథకం కింద 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20–25 గజాల అవిభాజ్య స్థల హక్కును లబ్ధిదారుడి పేరిట నమోదు చేస్తుందని, లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News
నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదించిన సైబరాబాద్ పోలీసులు.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్, సీసీఎస్ నార్సింగి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నకిలీ భారత కరెన్సీ, నకిలీ అమెరికన్ డాలర్లు, కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కెమికల్ మెటీరియల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నమ్మించి, నకిలీ నోట్లను రెట్టింపు చేస్తామని, కెమికల్స్‌తో కరెన్సీని తయారు చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మోసంలో భాగంగా నకిలీ నోట్లు, రసాయనాలను ఉపయోగించి బాధితులను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల హెచ్చరిక మేరకు ప్రజలు “డబ్బును రెట్టింపు చేస్తాం”, “కెమికల్స్‌తో కరెన్సీ తయారు చేస్తాం” వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra3 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News3 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
