Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్

Published

on

పెద్దపల్లి, జూలై 14 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలో బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏఈని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేష్ దర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఏఈ నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు

Published

on

బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్‌పై వెళ్తుండగా పుంగనూరు టోల్‌గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్‌లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Continue Reading

crime

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్

Published

on

సిద్దిపేట, బీబీఎంఏ న్యూస్, జూలై 6:

సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కోర్రా దిలీప్ నాయక్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. నాగపురి గ్రామానికి చెందిన 11 నాలా (NALA) భూ మార్పిడి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అనుకూలంగా చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా, సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

 

నిందితుడి వద్ద నుంచి రూ.70 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు తెలిపింది.

Continue Reading

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

Trending