Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమ ఫలితమేనని NSUI నేతల వ్యాఖ్యలు

Published

on

గోదావరిఖని: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఖని చౌరస్తాలో NSUI ఆధ్వర్యంలో విద్యార్థి విజయోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ నాయకత్వంలో, NSUI పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు అనంతరం బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, NEET UG-2026 పరీక్షా పత్రం లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల హక్కుల కోసం సాగిన పోరాటానికి తొలి విజయమని అన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేందుకు 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో ప్రవేశ అర్హత కల్పించే ప్రతిపాదనను స్వాగతించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ పోరాటాన్ని కొనియాడుతూ, యువత భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఉద్యమం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

అంతేకాకుండా, NEET పేపర్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరపడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, NTA పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో NSUI నాయకులు గంగారపు ప్రవీణ్, సంధీ అక్షయ్, కేశవ, జీవన్, ఆకాష్, కార్తీక్, చరణ్, దినేష్, సుమంత్, అభిషేక్, సనిత్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, రికీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వ లింగస్వామి, ఓదెలు, ధీటీ బాలరాజు, కొప్పుల శంకర్, ముస్తఫా, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, ఫజల్, దూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Politics

విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Published

on

(more…)

Continue Reading

Trending