Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

Published

on

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద చేపడుతున్న సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ఏర్పాటుపై రెడ్‌కో, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

కాటారం గ్రామంలోని 700 గృహాల్లో 1,400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రీయ భండార్ సంస్థ 180 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి సోలార్ మాడ్యూల్‌కు RFID ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, గుడిసెలు లేదా ఎత్తైన నిర్మాణాలపై ప్లాంట్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంట్ల ఏర్పాటుకు అనంతరం ఐదేళ్ల పాటు ఉచిత నిర్వహణ అందించడంతో పాటు, సమస్యలు తలెత్తితే 72 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.

 

ప్రస్తుతం 334 గృహాల సర్వే పూర్తికాగా, 110 ఇళ్ల రూఫ్‌టాప్‌లు గుర్తించినట్లు, 99 గృహాలకు అవసరమైన మెటీరియల్ అందించినట్లు అధికారులు తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా ఉచిత విద్యుత్‌తో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రెడ్‌కో డీఎం రాజేందర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, డీపీఓ శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు హెల్ప్‌లైన్.. 040-24603572 ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Published

on

హైదరాబాద్ నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కాల్‌సెంటర్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో 040-24603572 హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన మంత్రి, ప్రజలు మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 7,680 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, ఇతర ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. రూ.10 వేల EMDని UPI లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, ఇల్లు కేటాయించబడకపోతే అదే బ్యాంకు ఖాతాకు మొత్తం తిరిగి జమ అవుతుందని స్పష్టం చేశారు.

 

క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తూ, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండి, సొంత ఇల్లు లేదా స్థలం లేని కుటుంబాలు అర్హులని తెలిపారు. ఒక కుటుంబం నుంచి ఒకే దరఖాస్తు స్వీకరిస్తామని, అవసరమైతే పారదర్శక లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.

ఈ పథకం కింద 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో ఫ్లాట్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20–25 గజాల అవిభాజ్య స్థల హక్కును లబ్ధిదారుడి పేరిట నమోదు చేస్తుందని, లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఛేదించిన సైబరాబాద్ పోలీసులు.. ఇద్దరు విదేశీయులు అరెస్ట్

Published

on

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్, సీసీఎస్ నార్సింగి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేశారు.

 

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన నకిలీ భారత కరెన్సీ, నకిలీ అమెరికన్ డాలర్లు, కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కెమికల్ మెటీరియల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ప్రాథమిక విచారణలో నిందితులు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నమ్మించి, నకిలీ నోట్లను రెట్టింపు చేస్తామని, కెమికల్స్‌తో కరెన్సీని తయారు చేస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ మోసంలో భాగంగా నకిలీ నోట్లు, రసాయనాలను ఉపయోగించి బాధితులను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల హెచ్చరిక మేరకు ప్రజలు “డబ్బును రెట్టింపు చేస్తాం”, “కెమికల్స్‌తో కరెన్సీ తయారు చేస్తాం” వంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Continue Reading

News

కేటీఆర్ జన్మదిన వేడుకలు.. రామగుండంలో సేవా కార్యక్రమాలు

Published

on

రామగుండం, బీబీఎంఏ న్యూస్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రోజంతా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాసేవే కేటీఆర్ రాజకీయ జీవితానికి ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కోరుకంటి చందర్, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జవహర్‌లాల్‌నగర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. పార్టీ కార్యాలయంలో డయాలసిస్ రోగులకు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

మధ్యాహ్నం అమ్మ పరివార్ ఆశ్రమం, ఈశ్వర కృప ఆశ్రమం, తబిత ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టి వృద్ధులు, నిరాశ్రయులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ, రామగుండం అభివృద్ధికి కేటీఆర్ విశేష కృషి చేశారని, ఐటీ పార్క్ ఏర్పాటు, నగరాభివృద్ధికి నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్క్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.

ఈ సేవా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Continue Reading

Trending