Entertainment
Avatar: Fire and Ash ట్రైలర్ విడుదల
జేమ్స్ కామెరూన్ రాసి, దర్శకత్వం వహిస్తున్న Avatar: Fire and Ash తాజా ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ట్రైలర్ ఆరంభంలో పాండోరా లోని Ash People నాయకుడు వరాంగ్ (ఓనా చాప్లిన్) వారి Eywa దేవునిపై నమ్మకాన్ని ఎందుకు తిరస్కరించారో వివరిస్తూ హార్రిఫిక్ పూర్వచరిత్రను చెబుతాడు. అనంతరం నావీ జాతిలో అంతర్గత ఘర్షణల దృశ్యాలు చూపించబడ్డాయి. మొదటి రెండు చిత్రాల్లో విలన్‌గా ఉన్న కల్నల్ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) ఇప్పుడు వరాంగ్‌తో చేతులు కలిపి “ఫైర్”ను పాండోరా అంతటా వ్యాపింపజేయాలని ప్రయత్నిస్తాడు.
ట్రైలర్‌లో పాండోరా విండ్ట్రేడర్స్ గురించి కూడా తొలిసారి చూపించబడింది. వీరిపై ఆధారంగా నాలుగో భాగం నిర్మించబడనుంది.
🔹 నటీనటులు
ఈ సీక్వెల్‌లో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ చాంపియన్, బైలీ బాస్ తిరిగి కనిపించనున్నారు.
జియోవన్నీ రిబిసి (డాక్టర్ పార్కర్ సెల్ఫ్రిడ్జ్) 2009లో వచ్చిన Avatar నుండి మళ్లీ తన పాత్రలో కనిపించనున్నారు.
కొత్తగా ఓనా చాప్లిన్ (గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో తలీసా మైగర్‌గా ప్రసిద్ధి) వరాంగ్ పాత్రలో, డేవిడ్ థ్యులిస్ (హ్యారీ పోటర్‌లో రీమస్ లూపిన్‌గా పేరుపొందిన) పేలాక్ అనే విండ్ట్రేడర్‌గా నటించనున్నారు. మిచెల్ యియో నాలుగో సినిమాలో డాక్టర్ కరీనా మొగ్యూగా కనిపించనున్నారు.
🔹 రాబోయే సినిమాల షెడ్యూల్
-
Avatar: Way of Water (రెండవ భాగం) అక్టోబర్ 2న మళ్లీ థియేటర్లలో రీ–రిలీజ్ అవుతుంది.
-
Avatar 4 డిసెంబర్ 21, 2029న విడుదల కానుంది.
-
Avatar 5 డిసెంబర్ 19, 2031న రానుంది.
Entertainment
ఘనంగా ‘రీ-బర్త్’ హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలు
జూలై 18:గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో అసవి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత అశోక్ వేముల నిర్మిస్తున్న సందేశాత్మక చిత్రం ‘రీ-బర్త్’ షూటింగ్ సందర్భంగా హీరోయిన్ శ్రీలత నేత జన్మదిన వేడుకలను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. దర్శకుడు కొత్తూరు ప్రసాద్ చారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమేజింగ్ స్టార్ అశోక్ వేముల హీరోగా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అశోక్ వేముల మాట్లాడుతూ శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ప్రతిభావంతమైన నటి మాత్రమే కాకుండా సమాజ సేవ పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సినీ రంగంలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హీరోయిన్ శ్రీలత నేత మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘రీ-బర్త్’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా సమాజానికి ఉపయోగపడే సందేశంతో రూపొందుతోందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఓపీ దేవా, సహ దర్శకుడు రతన్ కుమార్, మేకప్ ఆర్టిస్టు అంజిబాబు, లక్ష్మణ్, నాగేష్, అప్రోజ్, ఫిరోజ్, సీనియర్ నటులు కనకా రెడ్డి, శిరీష, మేకల శ్రీకాంత్, చెర్రీ బాబు తదితరులు పాల్గొని శ్రీలత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Entertainment
ఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ఐబీ కాలనీ లో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి ఆలయం & నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15 బుధవారం నుండి నెల రోజులపాటు నిర్వహించు ఆషాడ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజ్ కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి కృపను పొందగలరని ఆలయ కమిటీ కోరుతుంది. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యార్థం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Entertainment
తమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
బిబిఎంఏ న్యూస్ / చెన్నై మే 10
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య విజయ్ సీఎం పదవిని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు కొంత సమయం అవసరమని ప్రజలను కోరుతూ, ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
తన పాలన పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని స్పష్టం చేసిన విజయ్, మహిళల భద్రత, డ్రగ్స్ రహిత సమాజం, అవినీతి నిర్మూలన, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ “విద్యార్థులకు విజయ్ మామ ఎప్పుడూ అండగా ఉంటాడు” అని అన్నారు. తమిళనాడులో ప్రజల ప్రభుత్వం ఏర్పడి కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విజయ్ వ్యాఖ్యానించారు.
-
News4 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Andhra3 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News2 weeks agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News1 week agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
-
News4 weeks agoవిదేశాల్లో ఉద్యోగం.. తల్లిదండ్రుల సేవలో నిఖిల్ ఆదర్శం
-
News2 weeks agoప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
-
News5 days agoమారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
