Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

బిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత

Published

on

జులై 11: మంథని పట్టణంలోని 3వ వార్డు ముత్యాలమ్మవాడలో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి, వర్షపు నీటితో కలిసి రోడ్లపైకి పొంగిపొర్లుతూ స్థానికుల ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న విషయం ఇటీవల జులై 10 నాడు బిబిఎంఏ  న్యూస్‌లో ప్రచురితమైంది. ఈ కథనాలపై స్పందించిన మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం, సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టి డ్రైనేజీలను శుభ్రం చేశారు.

డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మురుగును తొలగించి నీటి నిల్వలను నివారించడంతో స్థానికులకు ఉపశమనం లభించింది. సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న మున్సిపాలిటీ అధికారులకు, సిబ్బందికి ముత్యాలమ్మవాడ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చిన బిబిఎంఏ న్యూస్‌కు కూడా వారు అభినందనలు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: ఏసీపీ మడత రమేష్

Published

on

మంథని, బిబిఎంఏ న్యూస్, జూలై 11: విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఏసీపీ మడత రమేష్ సూచించారు. మంథని సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

క్రమశిక్షణతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులపై నిరాధార ఆరోపణలు చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పిల్లల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు విశ్వాసం ఉంచి వారితో నిరంతరం సమన్వయం కలిగి ఉండాలని కోరారు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరగడంతో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటి వద్ద పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, రోజువారీ అలవాట్లపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచి, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేలా ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని సీఐ బద్దె స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు సాంబయ్య, రమేష్ పున్నం, శ్రీనివాస్, రవీందర్, పీటీ రమేష్, అనిత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

SIR కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించిన కార్పొరేటర్ స్వరూప సతీష్

Published

on

గోదావరిఖని: 21వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతంలోని బూత్ నంబర్-230 పరిధిలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలకు SIR కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.

ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇంటింటికీ వచ్చే బీఎల్‌ఓలకు పూర్తి వివరాలు అందించి తమ ఓటును మ్యాపింగ్‌లో భద్రపరచుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బడుగు శ్రీనివాస్, కొలిపాక కనకరాజు, స్థానిక మహిళలు మరియు ఇతరులు పాల్గొని SIR కార్యక్రమానికి సహకారం అందించారు.

Continue Reading

News

సకాలంలో చికిత్సతో ప్రాణాలకు భరోసా

Published

on

గోదావరిఖని, జూలై 11: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ట్రామా కేర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు.

న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు ప్రాథమిక చికిత్స అందించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అన్ని వైద్య విభాగాలు అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెంటనే తరలిస్తే అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడడం సులభమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులు డాక్టర్ సత్యనారాయణ, అనస్థీషియా నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని ట్రామా కేర్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

Continue Reading

Trending