News
పట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్): పట్టణాన్ని ఆధునికంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పాత పెట్రోల్ బంక్ నుంచి మల్లెపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు 100 అడుగుల విశాల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తూ మంథని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి కూరగాయల మార్కెట్ సమీపంలోని తన కమర్షియల్ కాంప్లెక్స్‌ను స్వచ్ఛందంగా తొలగించాలని అధికారులను కోరడం విశేషంగా నిలిచింది. ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టిన ఆయన నిర్ణయాన్ని పట్టణ ప్రజలు, వ్యాపారులు, మేధావులు అభినందిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ప్రజల సహకారంతో మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథని పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని మున్సిపల్ పాలకవర్గం పేర్కొంది.
News
గానకోకిల ఎస్. జానకితో సన్నిహిత అనుబంధం కలిగిన మంథని మహిళ కన్నుమూత
బీబీఎంఏ న్యూస్ జూలై 17
మంథని ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం నాగ్‌పూర్‌లో స్థిరపడిన మహావాది మాధురి ఉమాదేవి గుల్కోట్‌వార్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇటీవల పూణేలో గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సంగీతంపై అపారమైన అభిరుచి కలిగిన ఉమాదేవికి ప్రముఖ గాయని ఎస్. జానకితో సన్నిహిత పరిచయం, ఆప్యాయ అనుబంధం ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంథని స్వస్థలమైన ఆమె వివాహానంతరం నాగ్‌పూర్‌లో నివసించినప్పటికీ, స్వగ్రామంతో బంధాన్ని కొనసాగించేవారు. సోదరులు సుధీర్, సతీష్, విజయ్, సోదరీమణులు రమాదేవి, వాణిశ్రీతో పాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయంగా మెలిగేవారు. విదేశాల్లో ఉన్న ఆమె పిల్లలు రజని, స్మిత, రవిలు తల్లి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నెల 22న నిర్వహించనున్న ద్వాదశ దినకర్మకు మంథని సహా పలు ప్రాంతాల నుంచి బంధువులు, ఆత్మీయులు హాజరై నివాళులర్పించనున్నారు.
News
మంథనికి రూ.20 కోట్ల న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్.. యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా కీలక అడుగు
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల (ఆర్&బీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఈ కేంద్రం కీలకంగా నిలవనుంది. ఇక్కడ స్వల్ప, దీర్ఘకాలిక కోర్సుల ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధితో పాటు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రం మంథనికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర తెలంగాణ యువతకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలకు ఈ కేంద్రం వారధిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News
తెలంగాణ ఉద్యమకారుల హామీలు వెంటనే అమలు చేయాలి: ఉద్యమకారుల ఫోరం
మంథని, జూలై 17 (బీబీఎంఏ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. మంథనిలోని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హైదరాబాద్‌లో కేకే కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల ఉద్యమకారుల సమావేశంలో మంథని ప్రాంతానికి చెందిన ఉద్యమకారులు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలను కమిటీకి అందజేసినట్లు తెలిపారు.ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉచిత బస్ పాస్, ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు, ఉచిత వైద్యం, ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్, పిల్లలకు ఉచిత విద్య వంటి హామీలను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫోరం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
crime2 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
crime5 days ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana1 week agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment5 days agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News1 week agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News7 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News2 weeks agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
