Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ.. సీఎం రేవంత్ విజన్

Published

on

ఎఫ్‌సీడీఏ భవనం, పోర్టల్ ప్రారంభం – 2034 నాటికి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

హైదరాబాద్, జూన్ 11 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి A. Revanth Reddy సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన తీర్మానాలు, విజ్ఞప్తుల ఆధారంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినట్లు వెల్లడించారు. మిగతా గ్రామాల అంశాన్ని గ్రామాల వారీగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న Future City Development Authority (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీ అధికారిక పోర్టల్‌ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ Gaddam Prasad Kumar, ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu, మంత్రి Duddilla Sridhar Babu, మంత్రి Ponguleti Srinivasa Reddy తదితరులు పాల్గొన్నారు.

 

ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదిరిగానే ఈ నగరం కూడా ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని, ‘నెట్ జీరో సిటీ’గా కాలుష్య రహిత అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

 

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో భారత్ ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని సీఎం తెలిపారు. టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీపడేలా రాబోయే ఎనిమిదేళ్లలో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

 

ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఫార్చూన్-500 సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే డిసెంబర్‌లో ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి భారీ పెట్టుబడులు రప్పించడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో ఏర్పడిన ట్రాఫిక్, వరద సమస్యలను ప్రస్తావించిన సీఎం, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Politics

విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Published

on

(more…)

Continue Reading

Trending