Andhra
విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్‌పై వెళ్తుండగా పుంగనూరు టోల్‌గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్‌లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Andhra
గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు
అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Andhra
తిరుపతి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు – పోలీస్ శాఖ ప్రకటన
తిరుపతి నగరంలో 12-06-2026 తేదీన నిర్వహించబడనున్న “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నేపథ్యంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు కేంద్ర మంత్రులు పాల్గొననున్న ఈ సభకు భారీ జనసందోహం ఏర్పడే అవకాశం ఉన్నందున ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.
చిత్తూరు, మదనపల్లి, కడప, నెల్లూరు, నాయుడుపేట, చెన్నై మరియు పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించబడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి తదితర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.
ప్రజలు ముందస్తుగా ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన మార్గాలను మాత్రమే వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షలు వర్తించవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు సిబ్బందికి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
Andhra
23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డు.. కాకినాడకు గర్వకారణమైన ఆమైరా ఖాదరి నవాజ్
అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి.. కలెక్టర్ హరి చందన్ ప్రత్యేక అభినందనలు
కాకినాడ, BBMA NEWS, జూన్ 11:
కాకినాడకు చెందిన 23 నెలల చిన్నారి షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ తన అసాధారణ ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. రామకృష్ణారావుపేటకు చెందిన ఎండీ బాషా మనవరాలు, షేక్ ఖజా మొహిద్దిన్ – మహమ్మద్ బషీర్ దంపతుల కుమార్తె అయిన ఆమైరా చిన్న వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి ఈ ఘనత సాధించింది.
పండ్లు, కూరగాయలు, ఇంగ్లీష్ అక్షరాలు, ఫోనిక్ పదాలు, సంఖ్యలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, గృహోపకరణాలు గుర్తించి చెప్పడమే కాకుండా వివిధ రైమ్స్‌ను సైతం చక్కగా చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. చిన్నారి ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ హరి చందన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన చాంబర్‌కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లను పరిశీలించిన కలెక్టర్, ఇంత చిన్న వయసులో ఇంతటి ప్రతిభ కనబరచడం గొప్ప విషయమని కొనియాడారు.
ఆమైరాను “వన్ ఇన్ ఎ మిలియన్”గా గుర్తిస్తూ పురస్కార పత్రాలను అందజేయడం విశేషమని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అలీమ్ తెలిపారు. చిన్నారి తండ్రి షేక్ ఖజా మొహిద్దిన్ చెన్నైలో వైర్లెస్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, తల్లి మహమ్మద్ బషీర్ ఎం.ఫార్మసీ పూర్తి చేసి గృహిణిగా ఉన్నారు. ఆమైరా సాధించిన ఘనతపై కాకినాడ వాసులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ చిన్నారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
-
crime1 week agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
Telangana3 days agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
crime12 hours ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment1 day agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News3 days agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News2 weeks agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
-
News3 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
