Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

రెడ్కో డివిజినల్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు..400 కోట్ల ఆస్తులు

Published

on

(REDCO) డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 7 ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కిలోల బంగారం, బ్యాంకు డిపాజిట్లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించారు.

 

ప్రాథమిక విచారణలో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా, వాటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు సమగ్ర పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

రూ.60 వేల లంచం కేసులో ఆదిలాబాద్ ఇరిగేషన్ ఈఈ, ఏఈ ఏసీబీ వలలో

Published

on

ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ (AO-1), అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్ (AO-2) లంచం కేసులో పట్టుబడ్డారు.

సోనాల్ గ్రామంలో వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేయడానికి ఫిర్యాదుదారుడి నుంచి రూ.60 వేల లంచం డిమాండ్ చేసి, ఏఈ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ వద్ద నుంచి రూ.60 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అధికారులను కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించింది. ప్రజాసేవకులు లంచం కోరితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Continue Reading

crime

2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్

Published

on

పెద్దపల్లి, జూలై 14 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం నిర్వహించిన దాడుల్లో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలో బిల్లులు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏఈని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేష్ దర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు ఏఈ నివాసంతో పాటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో నగదు, బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Continue Reading

Andhra

విధులకు వెళ్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు

Published

on

బీబీఎంఏ న్యూస్ – పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి సంచలనంగా మారింది. సోమవారం అర్థరాత్రి చిత్తూరులోని ఎంపీడీఎల్ డిస్టిలరీలో విధులకు బైక్‌పై వెళ్తుండగా పుంగనూరు టోల్‌గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

దేవేంద్ర 2023లో మదనపల్లె రామిరెడ్డిగారిపల్లె శివారులో కొనుగోలు చేసిన ఇంటి స్థలం విషయంలో తనను మోసం చేశారని ఆరోపిస్తూ తరిగొండ శ్రీనివాసులు రెడ్డి, నారాయణ రెడ్డి, సుధాకర్‌లపై ఇటీవల మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దేవేంద్ర మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రస్తుతం ఇది రోడ్డు ప్రమాదంగా నమోదు కాగా, భూ వివాదంతో ఏమైనా సంబంధం ఉందా అనే అంశంతో పాటు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Continue Reading

Trending