News
కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
కొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
బిబిఎంఏ న్యూస్:
లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి తమ సమస్యలను తెలియజేశారు. వడ్ల తూకంలో రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. ప్రతి 40 కిలోల సంచికి అదనంగా నాలుగు కిలోల వడ్లు తీసుకుంటూ తమను నష్టపరుస్తున్నారని వారు మండిపడ్డారు.
ఇదే కాకుండా, ఇప్పటికే విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. వర్షాల కారణంగా వడ్లు తడిసి నష్టపోతున్న పరిస్థితుల్లో అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, లారీ డ్రైవర్లు కూడా ప్రతి సంచికి రెండు కిలోలు అదనంగా వడ్లు ఇస్తేనే లోడింగ్‌కు వస్తామని షరతులు విధిస్తున్నారని రైతులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తూకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
News
దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్‌పై కూలిన చెట్టు
దండేపల్లిలో భారీ వర్షం బీభత్సం – బైక్‌పై చెట్టు కూలి నష్టం
బిబిఎంఏ న్యూస్:దండేపల్లి
దండేపల్లి, మే 6: మంగళవారం సాయంత్రం దండేపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ఈ వర్షానికి తోడు గాలులు తీవ్రంగా వీచడంతో ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ చెట్టు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన హోండా షైన్ బైక్‌పై కూలడంతో బైక్‌కు భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో బైక్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, ఫ్యూయల్ ట్యాంక్ మరియు సీటు కూడా నాశనమయ్యాయి. అదృష్టవశాత్తూ ఘటన సమయంలో బైక్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి మార్గాన్ని క్లియర్ చేశారు. భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News
రోడ్లపై చెట్లు… పరిస్థితులను సమీక్షించిన సీపీ
గాలి వానతో రోడ్లపై చెట్లు… వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు
బిబిఎంఏ న్యూస్/రామగుండం: అకాల గాలి వర్షం ప్రభావంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో పలు ప్రాంతాల్లో చెట్లు రోడ్లపై కూలిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలగగా, పోలీసులు వెంటనే స్పందించి చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎం. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్ కలిసి మంచిర్యాల, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో రోడ్లపై పడిన చెట్లను తొలగించారు.
అనంతరం సీపీ దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడలు కూలి నలుగురు మృతి చెందిన ఘటనలను పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ మార్పుల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
News
గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతలు
బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని,
మే 2: గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెల్లడించారు.
శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతల స్వీకరణతో స్థానిక న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సేవల్లో ఆమె అనుభవం ప్రజలకు న్యాయం అందించడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
-
News2 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
Police News4 weeks ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
News2 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News3 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
india2 weeks agoనేడే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ,
-
News2 weeks agoసూరయ్యపల్లిలో డ్రైనేజ్ పనుల ప్రారంభం రూ.10 లక్షలతో అభివృద్ధి
-
News2 weeks agoకాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
-
Telangana3 weeks agoఅణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం
