Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

లక్షెట్టిపేట గోడకూలి నలుగురు రైతులు మృతి

Published

on

 

పంట కాపాడే ప్రయత్నంలో విషాదం… లక్షెట్టిపేట మండలంలో గుండె విదారక ఘటన

బిబిఎంఏ న్యూస్:

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో అకాల వర్షం రైతు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ప్రభావంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో గోడ కూలి నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, కోత పూర్తయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను కల్లాల్లోనే నిల్వ ఉంచుకున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో ధాన్యం తడవకుండా కాపాడేందుకు సుమారు 15 మంది రైతులు కల్లాల వద్దకు చేరుకుని కవర్లు కప్పారు. అనంతరం సమీపంలోని పాత గోడ వద్ద నిలుచున్న సమయంలో ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి. గాలుల ఒత్తిడిని తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు. అయితే అప్పటికే నలుగురు రైతులు మృతి చెందినట్లు గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పంటను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, పంట కొనుగోళ్లలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వద్ద గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష

Published

on

రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.

దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Continue Reading

News

విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు

Published

on

పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.

మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.

Continue Reading

News

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలి: నల్లా రాధాకృష్ణ

Published

on

మేడ్చల్, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): హైదరాబాద్‌లోని నాచారంలో గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కులు, ఎస్సీ రిజర్వేషన్లపై సమావేశం నిర్వహించారు. బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంతం కాదని, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల హక్కు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు బుచ్చిగారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళిత క్రైస్తవుల సమస్యలు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల అమలుపై విస్తృతంగా చర్చించారు. గద్దర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Continue Reading

Trending