News
చుండూరు దళిత అమరవీరులకు గోదావరిఖనిలో ఘన నివాళులు
గోదావరిఖని, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్):
చుండూరు దళిత మారణకాండ జరిగి 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరిఖని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో చుండూరు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకుస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రతినిధి ఈదునూరి పద్మ, సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్ తదితరులు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కుల వివక్ష కారణంగా చుండూరులో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని, చుండూరు అమరవీరులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
News
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్, ఆగస్టు 6 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, త్యాగం చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Andhra
మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ఎమ్మార్పీఎస్
హామీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిక
కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: 2024 ఎన్నికల సమయంలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కచేరిపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు టీడీపీ విజయానికి కృషి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. నాలుగు రోజుల్లో సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
Andhra
పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేత అందించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
అందుబాటు ధరల్లో పశుదాణ సరఫరాకు ప్రత్యేక చర్యలు – సహకార సంఘాలతో సమన్వయంపై అధికారులకు ఆదేశాలు
అమలాపురం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేతను సకాలంలో, అందుబాటు ధరలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సాయి శివ హోమ్ క్యాటిల్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుదాణ నాణ్యత, పాల ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంఓయూ ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన పశుదాణ అందించి పాల ఉత్పత్తి పెంపునకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 150 టన్నుల పశుదాణ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ, సెప్టెంబర్‌తో ముగియనున్న ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు పశుదాణ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
-
crime3 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment3 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News7 days agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News4 weeks agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
