Andhra
నషా ముక్త్ భారత్‌కు 10 కోట్ల సంతకాల మహోద్యమం: బ్రహ్మాకుమారీస్
మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనే లక్ష్యం – ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు
కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల సంతకాల సేకరణ మహోద్యమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు, తల్లిదండ్రుల్లో మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మత్తు పదార్థాల వ్యసనం సమాజంలో వేగంగా విస్తరిస్తూ యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సమాజం, రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న ఈ 10 కోట్ల సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములై, మత్తు రహిత భారత నిర్మాణానికి సహకరించాలని బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
Andhra
మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ఎమ్మార్పీఎస్
హామీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిక
కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: 2024 ఎన్నికల సమయంలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కచేరిపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు టీడీపీ విజయానికి కృషి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. నాలుగు రోజుల్లో సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.
Andhra
పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేత అందించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
అందుబాటు ధరల్లో పశుదాణ సరఫరాకు ప్రత్యేక చర్యలు – సహకార సంఘాలతో సమన్వయంపై అధికారులకు ఆదేశాలు
అమలాపురం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేతను సకాలంలో, అందుబాటు ధరలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సాయి శివ హోమ్ క్యాటిల్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుదాణ నాణ్యత, పాల ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంఓయూ ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన పశుదాణ అందించి పాల ఉత్పత్తి పెంపునకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 150 టన్నుల పశుదాణ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ, సెప్టెంబర్‌తో ముగియనున్న ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు పశుదాణ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Andhra
ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ పాదయాత్రల లక్ష్యం: తాటిపాక మధు
ఆగస్టు 6 నుంచి ప్రజా సమస్యలపై పాదయాత్రలు – సెప్టెంబర్ 1న ‘ఛలో ఢిల్లీ’కి పిలుప
సామర్లకోట / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులు, యువతకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం సామర్లకోటలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “మార్పు రావాలి–మార్పు అనివార్యం” నినాదంతో ఆగస్టు 6 నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, కేజీ బేసిన్ సహజ వనరుల్లో రాష్ట్రానికి వాటా కల్పించాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
-
crime3 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment3 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 weeks agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News7 days agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
