News
విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు
పెద్దపల్లి/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో అమర్‌నగర్‌లోని MPUPS పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య మాట్లాడుతూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.
మహిళలు, విద్యార్థుల భద్రత కోసం బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లు, జనసమీకరణ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700కు ఫోన్ చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 100/112, ఆన్‌లైన్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళలు టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు స్నేహలత, మౌనిక పాల్గొన్నారు.
News
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్
ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి
గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
News
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష
రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
News
సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: మంథని పట్టణానికి చెందిన మాచిడి రాము గౌడ్ అన్నయ్య మాచిడి సత్యనారాయణ మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
-
News3 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime4 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana4 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra2 weeks agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
Entertainment4 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News4 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News1 week agoతెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
-
News3 days agoఏసీబీకి చిక్కిన డీఆర్వో ఏకా మురళికి పునర్నియామకం
