News
మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
మహబూబాబాద్, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విగ్రహం సమీపంలో శనివారం టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం.
మృతుడు కేసముద్రం మండలం బడితండాకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలు, టిప్పర్ వాహనం వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో బడితండా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News
పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణపై సమీక్ష.. ప్రజా అనుకూల పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
పాలకుర్తి, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
డీజీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ రాజా మహేంద్ర నాయక్శ నివారం పాలకుర్తి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని నేర కేసుల ఫైళ్లు, రికార్డులు, స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలను డీసీపీ పరిశీలించారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి కేసుల నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమైన డీసీపీ రాజా మహేంద్ర నాయక్, డీజీపీ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీసింగ్‌లో నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను సత్వరమే స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ప్రజా అనుకూల పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ, పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సై డి. పవన్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News
గూడెం అభివృద్ధికి కొత్త ఊపు.. ఆలయ పునరుద్ధరణ, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు.
శనివారం దండేపల్లి మండలం గూడెంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు , మంత్రి అడ్లూరి కుమార్ , మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గూడెం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
News
ధర్మపురి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్
పెండింగ్ కేసులు, సైబర్ అవగాహన, నేర నియంత్రణపై కీలక ఆదేశాలు
ధర్మపురి, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
జగిత్యాల జిల్లా పోలీసింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నివారం ధర్మపురి పోలీస్ స్టేషన్‌తో పాటు ధర్మపురి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, ట్రయల్ పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు.
కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఐకి సూచించారు.
కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు, సామాజిక సమస్యలు, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ తెలిపారు. అలాగే సీసీ కెమెరాల ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా చైతన్యం కల్పించాలని సూచించారు.
నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ వెంట ఉంచుకోవాలని సూచించిన ఎస్పీ, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, సీఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్‌ఐలు మహేష్, రవీందర్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-
News3 days agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News2 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
