News
గూడెం అభివృద్ధికి కొత్త ఊపు.. ఆలయ పునరుద్ధరణ, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల, జూన్ 13 (బీబీఎంఏ న్యూస్):
ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు.
శనివారం దండేపల్లి మండలం గూడెంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు , మంత్రి అడ్లూరి కుమార్ , మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో కలిసి శ్రీ రామా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గూడెం దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
News
ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం
హైదరాబాద్ ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడు పులి కృష్ణ కుటుంబానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం రాష్ట్ర కమిటీ రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన పులి కృష్ణ గత జూన్ 29న మూడో అంతస్తులో తడకల పందిరి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఘటన అనంతరం సంఘం నాయకులు స్పందించి కార్యక్రమ నిర్వాహకులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నందికంటి చంద్రశేఖర్, ప్యారసాని ఈశ్వర్, అంగల్ల శ్రీనివాస్, అంగల్ల సంపత్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డెకరేషన్ వృత్తిదారుల సంక్షేమం కోసం అందరూ సంఘంలో సభ్యులుగా చేరి లేబర్ కార్డులు పొందాలని, ప్రమాద బీమా, సంక్షేమ పథకాల సాధనకు సంఘం మరింత బలోపేతం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
News
మున్సిపల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
News
చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News2 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana3 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra6 days agoబ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News4 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News3 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
