Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

మహిళా సంఘాల ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడమే లక్ష్యం: మంత్రి సీతక్క

Published

on

BBMA NEWS:

ములుగు జిల్లా మహిళా సంఘాల ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘మా శక్తి’ బ్రాండ్ లోగోను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేస్తున్న పసుపు, కారం, ఇప్పపువ్వు ఉత్పత్తులు, హస్తకళలు, పెయింటింగ్స్, బొమ్మలు, టైలరింగ్ ఉత్పత్తులు తదితర వస్తువులకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ‘మా శక్తి’ బ్రాండ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బ్రాండింగ్, ప్యాకింగ్, లేబులింగ్ ద్వారా ఉత్పత్తుల విలువ పెరిగి మార్కెట్లో విశ్వసనీయత, ఆదరణ పెరుగుతాయని పేర్కొన్నారు.

 

మహిళల ఉత్పత్తులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలు కల్పించి మహిళల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

జిల్లాలో మహిళలు తయారు చేసే అన్ని ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, ఒకే గుర్తింపు కల్పించడం ద్వారా ములుగు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు బాటలు పడతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత దిశగా కీలక ముందడుగుగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం

Published

on

హైదరాబాద్ ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడు పులి కృష్ణ కుటుంబానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం రాష్ట్ర కమిటీ రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన పులి కృష్ణ గత జూన్ 29న మూడో అంతస్తులో తడకల పందిరి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఘటన అనంతరం సంఘం నాయకులు స్పందించి కార్యక్రమ నిర్వాహకులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నందికంటి చంద్రశేఖర్, ప్యారసాని ఈశ్వర్, అంగల్ల శ్రీనివాస్, అంగల్ల సంపత్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డెకరేషన్ వృత్తిదారుల సంక్షేమం కోసం అందరూ సంఘంలో సభ్యులుగా చేరి లేబర్ కార్డులు పొందాలని, ప్రమాద బీమా, సంక్షేమ పథకాల సాధనకు సంఘం మరింత బలోపేతం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Continue Reading

News

మున్సిపల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Published

on

(more…)

Continue Reading

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending