crime
వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
BBMA NEWS:
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
crime
లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్.. గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం
బెల్లంపల్లి, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, రెండు డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ACB
ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై అక్రమాస్తుల కేసు నమోదు
హైదరాబాద్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): తెలంగాణ రోడ్లు & భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) చీఫ్ ఇంజినీర్ (స్టేట్ రోడ్స్) జరుపుల మోహన్ నాయక్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి మంగళవారం విస్తృత సోదాలు నిర్వహించారు.
మోహన్ నాయక్ కార్యాలయం, నివాసం, బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి, కొంపల్లి, గచ్చిబౌలిలో ఏడు ఫ్లాట్లు, మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, నిజామాబాద్‌లో విల్లా కొనుగోలుకు చెల్లించిన అడ్వాన్స్ సహా పలు ఆస్తులు గుర్తించారు.
అదనంగా రూ.55 లక్షల నగదు, రూ.1.44 కోట్ల బ్యాంకు నిల్వలు, సుమారు 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లకు పైగా ఉండగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోహన్ నాయక్‌ను అరెస్ట్ చేసి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
crime
ప్రియుడితో కలిసి భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య
బిబిఎంఏ న్యూస్ / సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసిన ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. అనంతరం జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంఘటన నారాయణఖేడ్ మండలంలో సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి 12 ఏళ్ల క్రితం కల్పనతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న కల్పనకు ఎల్గోయి గ్రామానికి చెందిన బేగరి పండరి అలియాస్ చింటూతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు తెలిపారు.
తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, చింటూ కలిసి ముత్యం రెడ్డిని హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో జేసీబీతో గొయ్యి తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, ఆనవాళ్లు కనిపించకుండా రాళ్లు వేసినట్లు సమాచారం.
హత్య తర్వాత భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ డ్రామా ఆడినట్లు దర్యాప్తులో తేలింది. తొమ్మిది రోజుల విచారణ అనంతరం కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణను ముమ్మరం చేయగా.. చివరకు ఇద్దరూ నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది.
నిందితులు తెలిపిన ప్రదేశంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, తహశీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
-
News1 day agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News1 week agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB1 week agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
