Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యపై కేంద్ర మంత్రికి వినతి

Published

on

8 ఇంక్లైన్ కాలనీ, బీబీఎంఏ న్యూస్, జూన్ 11:

సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మారుపేర్ల (అలియాస్నే మ్స్ ) సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు బద్రి దేవేందర్ పటేల్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిను ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు.

 

ఈ సందర్భంగా సింగరేణి సంస్థ రికార్డుల్లో నమోదైన మారుపేర్లకు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమస్య వల్ల కార్మికులకు అందాల్సిన పలు సంక్షేమ ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయని, వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ అంశంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో సమన్వయం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని పేర్కొన్నట్లు వెల్లడించారు.

 

సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బద్రి దేవేందర్ పటేల్ స్పష్టం చేశారు.

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Politics

విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Published

on

(more…)

Continue Reading

Trending