Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు వ్యవసాయ అధికారి డాక్టర్ నవ్య

Published

on

మంథని, జూన్ 11 (బీబీఎంఏ న్యూస్): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో గురువారం మండల వ్యవసాయ అధికారి డాక్టర్ నవ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, సంబంధిత పత్రాలను పరిశీలించి నిబంధనల అమలుపై ఆరా తీశారు.

 

రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, పాత ఎరువులను పెంచిన ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

అనంతరం సూర్యపల్లి రైతు వేదికలో నిర్వహించిన “ఖేతి బచావో” కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులు ఆసక్తి చూపాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

 

భూసార పరిరక్షణ వ్యవసాయాభివృద్ధికి కీలకమని పేర్కొంటూ, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా దిగుబడులు మెరుగుపడటంతో పాటు భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించవచ్చని తెలిపారు. రైతులు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డాక్టర్ నవ్య సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Politics

విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Published

on

(more…)

Continue Reading

Trending