News
ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీబీఎంఏ న్యూస్, హైదరాబాద్, జూన్ 11:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం జలసౌధలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతున్న న్యాయపరమైన సమస్యలు, పర్యావరణ అనుమతుల అంశాలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల పనులు మరింత వేగవంతంగా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టి, పెండింగ్‌లో ఉన్న అనుమతులు, సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు సాగునీటి ప్రయోజనాలు త్వరగా అందేలా ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వకిటి శ్రీహరి, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News
చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
Politics
విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
-
crime3 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News1 week agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana2 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra4 days agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News4 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment2 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News2 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
