Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

నీటిమునిగే ప్రాంతాలు, ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతాల్లో డీసీపీ అవినాష్ కుమార్ తనిఖీలు

Published

on

హైదరాబాద్, జూన్ 11:రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని నీటిమునిగే ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీ మరియు ఆక్రమణలకు గురయ్యే ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. డీసీపీ ట్రాఫిక్-1 అవినాష్ కుమార్ ఐపీఎస్, ఏసీపీ ట్రాఫిక్ ఖైరతాబాద్ మోహన్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అబిడ్స్, జీపీఓ, ఎంజే మార్కెట్, బ్యాంక్ స్ట్రీట్, డీఎంహెచ్‌ఎస్, సుల్తాన్ బజార్ ప్రాంతాలను సందర్శించారు.

 

పరిశీలన సందర్భంగా వర్షాకాలంలో ఎదురయ్యే సవాళ్లపై సమీక్ష నిర్వహించి, ట్రాఫిక్ నియంత్రణ, నీటి నిల్వల నివారణ, వాహనాలు మరియు పాదచారుల రాకపోకలు సాఫీగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

 

ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యాల కల్పనకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు కొనసాగిస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

పెద్దపల్లిలో విశాల్ మార్ట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Published

on

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్ షాపింగ్ మాల్‌ను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ మార్ట్ యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించింది. అనంతరం షాపింగ్ మాల్‌ను పరిశీలించిన విజయరమణ రావు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థ స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, విశాల్ మార్ట్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Politics

విద్యార్థుల నిరసనల వెనుక విదేశీ హస్తం ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

Published

on

(more…)

Continue Reading

Trending