Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

అసాంఘిక కార్యకలాపాలకు లాడ్జ్‌లు అడ్డాగా మారొద్దు: ఇన్‌స్పెక్టర్ శివకుమార్

Published

on

హనుమకొండ, జూన్ 10 ( బిబిఎంఏ న్యూస్):

హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్‌లలో ఎటువంటి అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని లాడ్జ్ నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ, లాడ్జ్‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వేదికగా మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జ్‌లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే సంబంధిత నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

సమావేశంలో పాల్గొన్న లాడ్జ్ నిర్వాహకులు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు గదులు అద్దెకు ఇవ్వబోమని తీర్మానం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అలాంటి వ్యక్తులకు గదులు కేటాయిస్తే వారిపై జరిమానా విధించేలా పరస్పరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో సెక్టార్ ఎస్సై కిషోర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడి కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం

Published

on

హైదరాబాద్ ప్రమాదంలో మృతి చెందిన డెకరేషన్ వృత్తిదారుడు పులి కృష్ణ కుటుంబానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం డెకరేషన్ విభాగం రాష్ట్ర కమిటీ రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన పులి కృష్ణ గత జూన్ 29న మూడో అంతస్తులో తడకల పందిరి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. ఘటన అనంతరం సంఘం నాయకులు స్పందించి కార్యక్రమ నిర్వాహకులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సభ్యుల నుంచి విరాళాలు సేకరించి రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నందికంటి చంద్రశేఖర్, ప్యారసాని ఈశ్వర్, అంగల్ల శ్రీనివాస్, అంగల్ల సంపత్ తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. డెకరేషన్ వృత్తిదారుల సంక్షేమం కోసం అందరూ సంఘంలో సభ్యులుగా చేరి లేబర్ కార్డులు పొందాలని, ప్రమాద బీమా, సంక్షేమ పథకాల సాధనకు సంఘం మరింత బలోపేతం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

Continue Reading

News

మున్సిపల్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Published

on

(more…)

Continue Reading

News

చౌదరిగూడ దుర్గమ్మ మహంకాళి బోనాల వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్

Published

on

మేడ్చల్–మల్కాజ్గిరి: మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన దుర్గమ్మ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం SIR ఇన్‌చార్జి గజ్జల కాంతంతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొంటూ భక్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రే రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

Trending