ACB
జగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
బిబిఎంఏ న్యూస్ /జగిత్యాల, జూన్ 4:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
సమాచారం ప్రకారం, ఓ వ్యక్తి అధికారిక పనికి సంబంధించి ఎఫ్‌ఆర్‌ఓ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేసేందుకు రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో గురువారం కొడిమ్యాల అటవీశాఖ కార్యాలయంలో వల పన్ని, లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను పట్టుకున్నారు.
ఈ దాడిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోని సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ ఉక్కుపాదం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ACB
కామారెడ్డి తహసీల్దారు లంచం కేసులో అరెస్టు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలో తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుని నాన్న గారి పేరులో ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుని పేరుకు మార్చేందుకు అనుకూల నివేదికను సంబంధిత అధికారులకు పంపించే ప్రతిపాదనతో ₹50,000/- రూపాయల లంచాన్ని ఒక ప్రయివేటు వ్యక్తి చిన్నూరి అజయ్ సహాయంతో స్వీకరించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఈ మొత్తం ఘటనపై తెలంగాణ అన్‌ఛా అధికారుల పర్యవేక్షణలో విచారణ జరపబడింది.
ఈ కేసు అధికారులు అవినీతి నిరోధక చర్యల్లో ఎంతగా కఠినంగా వ్యవహరిస్తున్నారో నిరూపిస్తోంది. ప్రజలకు న్యాయం అందించేందుకు, అవినీతి కట్టడి చేయడానికి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అందరికీ స్పష్టమవుతోంది. లంచం తీసుకునే విధానాలను ఎవరైనా పాటిస్తే, వారిపై తగిన శిక్ష తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ చర్యలకు మద్దతుగా తమ వైపు నుండి సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఈ సంఘటన స్థానిక పరిపాలన వ్యవస్థలో అవినీతి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దృఢమైన సందేశం అయింది. తద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ అధికారం కృషి చేస్తోంది. లంచ దందా వంటి అసాంఘిక వ్యవహారాలపై దృష్టి సారించడం ద్వారా సమాజంలో పారదర్శకత పెంపొందించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ACB
ఏలూరు ఏసీబీ డీఎస్పీగా జి.వి. కృష్ణారావు బాధ్యతల స్వీకరణ
ఏలూరు జిల్లా…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా జి.వి. కృష్ణారావు ఏలూరు లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఎస్‌ఐ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పనిచేశారు. తదనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పెరవలి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. తరువాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోలోపనిచేశారు. 2020 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో డిఎస్పీగా పనిచేసి తరువాత పాలకొండ SDPO గా, APSP 8th బెటాలియన్ లో DSP గాపనిచేసి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా, ఏలూరు కార్యాలయములో బాధ్యతలు స్వీకరించినారు. అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయముగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని కోరినారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అంతే కాకుండా DSP గారి మొబైల్ నెంబర్ 9440441657 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేసినారు…
ACB
బిల్లుల ప్రాసెసింగ్ పేరుతో సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్
బాధితుడి యొక్క GPF, సరెండర్ లీవ్, మరియు FTA (ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్) బిల్లులను ముందుగా తయారు చేసినందుకు గాను మరియు ఇప్పుడు వైద్య చెల్లింపు బిల్లులను తయారు చేయడం కోసం, భీమన్న, సీనియర్ అసిస్టెంట్, PHC బాసర I/C PHC తానుర్ gaaru రూ. 9000/లు లంచం డిమాండ్ చేసి, ఫోన్ పే ద్వారా తీసుకున్నారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana2 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment4 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
