ACB
ఏలూరు ఏసీబీ డీఎస్పీగా జి.వి. కృష్ణారావు బాధ్యతల స్వీకరణ
ఏలూరు జిల్లా…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా జి.వి. కృష్ణారావు ఏలూరు లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఎస్‌ఐ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పనిచేశారు. తదనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పెరవలి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. తరువాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోలోపనిచేశారు. 2020 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో డిఎస్పీగా పనిచేసి తరువాత పాలకొండ SDPO గా, APSP 8th బెటాలియన్ లో DSP గాపనిచేసి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా, ఏలూరు కార్యాలయములో బాధ్యతలు స్వీకరించినారు. అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయముగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని కోరినారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అంతే కాకుండా DSP గారి మొబైల్ నెంబర్ 9440441657 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేసినారు…
ACB
కామారెడ్డి తహసీల్దారు లంచం కేసులో అరెస్టు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలో తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుని నాన్న గారి పేరులో ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుని పేరుకు మార్చేందుకు అనుకూల నివేదికను సంబంధిత అధికారులకు పంపించే ప్రతిపాదనతో ₹50,000/- రూపాయల లంచాన్ని ఒక ప్రయివేటు వ్యక్తి చిన్నూరి అజయ్ సహాయంతో స్వీకరించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఈ మొత్తం ఘటనపై తెలంగాణ అన్‌ఛా అధికారుల పర్యవేక్షణలో విచారణ జరపబడింది.
ఈ కేసు అధికారులు అవినీతి నిరోధక చర్యల్లో ఎంతగా కఠినంగా వ్యవహరిస్తున్నారో నిరూపిస్తోంది. ప్రజలకు న్యాయం అందించేందుకు, అవినీతి కట్టడి చేయడానికి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అందరికీ స్పష్టమవుతోంది. లంచం తీసుకునే విధానాలను ఎవరైనా పాటిస్తే, వారిపై తగిన శిక్ష తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ చర్యలకు మద్దతుగా తమ వైపు నుండి సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఈ సంఘటన స్థానిక పరిపాలన వ్యవస్థలో అవినీతి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దృఢమైన సందేశం అయింది. తద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ అధికారం కృషి చేస్తోంది. లంచ దందా వంటి అసాంఘిక వ్యవహారాలపై దృష్టి సారించడం ద్వారా సమాజంలో పారదర్శకత పెంపొందించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ACB
బిల్లుల ప్రాసెసింగ్ పేరుతో సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్
బాధితుడి యొక్క GPF, సరెండర్ లీవ్, మరియు FTA (ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్) బిల్లులను ముందుగా తయారు చేసినందుకు గాను మరియు ఇప్పుడు వైద్య చెల్లింపు బిల్లులను తయారు చేయడం కోసం, భీమన్న, సీనియర్ అసిస్టెంట్, PHC బాసర I/C PHC తానుర్ gaaru రూ. 9000/లు లంచం డిమాండ్ చేసి, ఫోన్ పే ద్వారా తీసుకున్నారు.
ACB
కల్వకుర్తి సబ్ డివిజన్‌లో లంచం స్వీకరిస్తూ ఉప ఇంజనీరు పట్టుబాటు
“ఫిర్యాదుధారుని ఇంటి దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు అతని పేరు మీద మీటర్ అందించడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- డిమాండ్ చేసి అందులోనుండి రూ.15,000/- తీసుకుంటూ పట్టుబడిన నాగర్ కర్నూల్ డివిజన్ & సర్కిల్ (టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్.) లోని కల్వకుర్తి సబ్ డివిజన్ లో గల సహాయ డివిజనల్ ఇంజనీరు వారి కార్యాలయంలోని ఉప ఇంజనీరు (ఆపరేషన్స్) & వెల్దండ సెక్షన్ ఇంచార్జి అసిస్టెంట్ ఇంజనీరు-యెద్దుల వెంకటేశ్వర్లు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును
.
-
Politics2 weeks agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
Police News3 days agoBBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత
-
News4 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
Telangana2 weeks agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
News3 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
News4 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Police News5 days agoBBMA POLICE E:NEWS పోలీసుల్లో నూతనోత్సాహం.. క్రీడల కోలాహలం
-
News7 days agoBBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
