Police News
పెద్దబొంకూర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్
సైబర్ నేరాలపై అవగాహన, 40 వాహనాల స్వాధీనం
పెద్దపల్లి, బీబీఎంఏ న్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి రూరల్ ఎస్‌ఐ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆస్తి సంబంధిత నేరాలు, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మి వ్యక్తిగత, బ్యాంకు వివరాలను పంచుకోవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అనంతరం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 6 ఆటోలు, 34 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 40 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
News
దొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
ధర్మారం, మే 30 (బీబీఎంఏ న్యూస్):
ధర్మారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీకి చెందిన దోపిడీ ముఠాలోని ఇద్దరు సభ్యులు పెద్దపల్లి పట్టణంలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు పెద్దపల్లి పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్రామస్తులు, పట్టణ ప్రజలు తమ ఇళ్లు, ఆస్తుల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మారం ఎస్సై ప్రవీణ్ సూచించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు లేదా పోలీసులు విడుదల చేసిన ఫోటో, వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపించినట్లయితే వెంటనే ధర్మారం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల అప్రమత్తత, సహకారంతోనే ఇటువంటి నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
News
ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు
ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
బిబిఎంఏ న్యూస్ : రామగుండం
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, కరుణ, శాంతికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
పండుగ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈద్గాలు, మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ తెలిపారు. ప్రార్థనల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రేమ, మానవత్వం, త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా పరస్పర మతాలను గౌరవించుకుంటూ సోదరభావంతో పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించిన సీపీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని కోరారు.
News
అర్ధరాత్రి మసీదులు, ఈద్గాల తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ
బక్రీద్ వేడుకల కోసం మంచిర్యాలలో కట్టుదిట్టమైన భద్రత
బిబిఎంఏ న్యూస్ : మంచిర్యాల
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అప్రమత్తమయ్యారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి సమయంలో మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో మసీదులు, ఈద్గాలు, చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పండుగ విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడైనా చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచించారు.
బక్రీద్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీసీపీ తెలిపారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చగొట్టే పోస్టులు, అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్-100ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
-
crime3 weeks agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News2 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
Telangana1 week agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
Entertainment3 weeks agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime3 weeks agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime3 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News1 week agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News4 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
