News
తలసేమియా పై అవగాహనతోనే నివారణ సాధ్యం: వైద్యాధికారి దీప్తి
బిబిఎంఎ న్యూస్/ మహాముత్తరం 08: అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మెడికల్ ఆఫీసర్ దీప్తి మాట్లాడుతూ తలసేమియా అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి కారణంగా తీవ్రమైన అలసట, లేత చర్మం, శారీరక ఎదుగుదల లోపం వంటి సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ప్రజలు ముందస్తుగా పరీక్షలు చేయించుకుని అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, హెచ్‌ఏ రవీందర్, ఫార్మసిస్ట్ భాగ్యలక్ష్మి, డీఈఓ సుమన్, స్టాఫ్ నర్స్ సుధ, నందనాయక్ తదితరులు పాల్గొన్నారు.
News
నూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
పెద్దపల్లి, జిల్లా బిబిఎంఎ న్యూస్ జూన్ 14:
నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత నూతన పోలీస్ స్టేషన్ల స్వంత భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు సంబంధిత అధికారులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన భూ విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నివేదికను త్వరితగతిన సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన భవనాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
End
Andhra
గిట్టుబాటు ధర లేక రోడ్డుపైనే మామిడి పంట.. ఆవేదనలో ఏపీ రైతులు
అమరావతి, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏడాది పొడవునా శ్రమించి, భారీ పెట్టుబడులు పెట్టి పండించిన మామిడి పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరలు మరింత పతనమవడంతో కొందరు రైతులు తమ పంటను రోడ్డు పక్కనే పారేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బంగినపల్లి, తోతాపురి వంటి మామిడి రకాలకు ఆశించిన స్థాయిలో ధరలు దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం లభిస్తున్న ధరలు కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎరువులు, పురుగుమందులు, కార్మిక వ్యయాలు, రవాణా ఖర్చులు పెరగడంతో సాగు వ్యయం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News
ఘోర రోడ్డు ప్రమాదం.. డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
జనగామ, జూన్ 14 (బీబీఎంఏ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ డెంటల్ వైద్యురాలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నయీంనగర్‌కు చెందిన మహ్మద్ రహముద్దీన్ కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో రహముద్దీన్ కుమార్తె, డెంటిస్ట్ హబీబా హఫ్సా (27), బంధువైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మహ్మద్ అసదుద్దీన్ (26) అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
-
News2 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News3 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News1 week agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
