Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతలు

Published

on

బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని,

మే 2: గోదావరిఖనిలో రెండవ అదనపు జిల్లా జడ్జిగా శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు, ప్రధాన కార్యదర్శి గుజ్జేటి సత్యనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వెల్లడించారు.

శ్రీనిజ కోహిర్కర్ బాధ్యతల స్వీకరణతో స్థానిక న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని బార్ అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ సేవల్లో ఆమె అనుభవం ప్రజలకు న్యాయం అందించడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

డీజీపీగా సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు

Published

on

డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్.. శివధర్ రెడ్డి సేవలకు ప్రశంసలు

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీవీ ఆనంద్ మే 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గురువారం పదవీ విరమణ పొందుతున్న సీనియర్ పోలీస్ అధికారి శివధర్ రెడ్డి సేవలను ఆయన కొనియాడారు.

32 సంవత్సరాలపాటు పోలీస్ శాఖలో శివధర్ రెడ్డి అందించిన సేవలు అమూల్యమని ఆనంద్ పేర్కొన్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, మావోయిస్టుల లొంగుబాటులో కీలకపాత్ర పోషించారని తెలిపారు. భారీ స్థాయిలో ఆయుధాల స్వాధీనం వంటి విజయాలు రాష్ట్ర భద్రతకు ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారని కొనియాడారు.

ఇక రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలు, నార్కోటిక్ డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రధాన సవాళ్లుగా మారాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

2016 నుంచి తనతో కలిసి పనిచేసిన అధికారుల అనుభవంతో టీమ్ వర్క్‌గా ముందుకు సాగుతామని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని కాపాడటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Continue Reading

News

అచలాపూర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

Published

on

 

బిబిఎంఏ న్యూస్ /తాండూర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాండూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అచలాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు భద్రత, నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా 40 బైక్‌లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. సైబర్ మోసాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోరాదని హెచ్చరించారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం దూరంగా ఉండాలని యువతకు సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని చెప్పారు.

సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో భద్రత పెంపొందించవచ్చని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

india

అభిషేక్–హెడ్ ధాటికి SRH భారీ విజయం

Published

on

అభిషేక్–హెడ్ మెరుపులు.. భారీ టార్గెట్ ఛేజ్ చేసి SRH ఘన విజయం

బిబిఎంఏ న్యూస్: ముంబయి

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ 18.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు బలమైన ఆరంభం అందించారు. ఇద్దరూ కలిసి 129 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను SRH వైపు తిప్పారు.

ఈ జోడీ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా (6 సార్లు) వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా నిలిచి, డేవిడ్ వార్నర్–శిఖర్ ధావన్ రికార్డును సమం చేసింది. అనంతరం వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో సలీల్ ఆరోరా 10 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన mi 244 పరుగుల భారీ లక్ష్యం ఛేజ్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యధిక ఛేజ్‌గా నమోదు చేసింది. జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శనతో అభిమానులను అలరించింది.

Continue Reading

Trending