Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

అచలాపూర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

Published

on

 

బిబిఎంఏ న్యూస్ /తాండూర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని తాండూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అచలాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు భద్రత, నేరాల నివారణపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా 40 బైక్‌లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. సైబర్ మోసాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోరాదని హెచ్చరించారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం దూరంగా ఉండాలని యువతకు సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని చెప్పారు.

సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామాల్లో భద్రత పెంపొందించవచ్చని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి.. శంకర్ గౌడ్ డిమాండ్

Published

on

ఉద్యమకారుల హక్కుల కోసం మరోసారి గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారుల సమితి

గోదావరిఖని, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖనిలోని సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం చేయకుండా అమలు చేయాలని కోరారు. హామీల అమలులో నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమకారులంతా పార్టీలు, వ్యక్తిగత భేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర, జిల్లా మహిళా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా అనుముల కళావతి, కార్యదర్శిగా తోడేటి స్వరూప, ఉపాధ్యక్షులుగా కోడిపుంజుల జ్యోతి, గంగారపు శాంతలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా మేకల సరోజన, కార్యదర్శిగా పున్నం మంజులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఎన్టీపీసీ పట్టణ కమిటీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Continue Reading

News

మారుపేర్ల సమస్య పరిష్కరించాలి.. ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట దీక్ష

Published

on

రామగుండం, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు ఏరియా కోల్‌బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు ఆర్జీ–1 జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను ప్రారంభించారు. మొదటి రోజు దీక్షకు వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు సంఘీభావం తెలిపారు.

దీక్షకు ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యలు కొన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

దీక్షలో లక్కా శ్రావణ్ గౌడ్, పార్తపల్లి హరీష్ యాదవ్, ఉస్మాన్, మోత్కూరి రవికుమార్, ఆవుల రవి తదితర బాధితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Continue Reading

News

సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

Published

on

మంథని/బీబీఎంఏ న్యూస్/ఆగస్టు 8: మంథని పట్టణానికి చెందిన మాచిడి రాము గౌడ్ అన్నయ్య మాచిడి సత్యనారాయణ మృతి చెందడంతో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు నిమ్స్ ఆసుపత్రికి చేరుకుని సత్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని, ఈ విషాద సమయంలో వారు ధైర్యంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Continue Reading

Trending