News
కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
బిబిఎంఏ న్యూస్ /
భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 20: రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం చేరుకున్నారు. ముందుగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ శుభానంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రూ.198 కోట్ల వ్యయంతో చేపట్టనున్న కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలతో సీఎంను సన్మానించి, చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు తీర్థప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు. సీఎం రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
తరువాత సీఎం మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకుని అనిల్ జైన్తో కలిసి బ్యారేజ్‌ను పరిశీలించారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పరిస్థితులపై చర్చించారు.
సీఎం వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కాటారం మండలం నస్తూరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
News
“ప్రజలకు గౌరవం.. నేరస్తులకు కఠిన చర్యలు” – డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలో మావోయిజం అంతమైందని ప్రకటన.. గ్రేహౌండ్స్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ
హైదరాబాద్, జూన్ 10:
తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలను గౌరవిస్తామని, అయితే రౌడీలు, గుండాలు, నేరగాళ్ల పట్ల ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా అంతమయ్యాయని పేర్కొన్న డీజీపీ, ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని వెల్లడించారు. గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న సుమారు 1,700 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసి వారి సేవలను వినియోగించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాలు ప్రస్తుతం పోలీసు శాఖకు అతిపెద్ద సవాల్‌గా మారాయని, వాటి నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన డీజీపీ, ప్రజల సహకారంతో నేర నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు
News
అరైవ్ అలైవ్ కార్యక్రమానికి హాజరైన ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్
జనగామలో ఘన స్వాగతం.. గౌరవ వందనంతో ఆహ్వానించిన పోలీసులు
జనగామ, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి గ్రేహౌండ్స్, ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సన్ ప్రీత్ సింగ్ డీజీపీ అనిల్ కుమార్‌కు పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమం ప్రాధాన్యతను అధికారులు వివరించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
జగిత్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జిల్లా స్థాయి ఉపసర్పంచ్‌ల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపసర్పంచ్‌ల ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ ఉపసర్పంచ్ మేరుగు జంపన్న (జానీ)ను ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, ఉపసర్పంచ్‌లు అభినందనలు తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి పూర్తి స్థాయిలో ఉపసర్పంచ్‌లు హాజరు కాలేకపోవడంతో తాత్కాలిక జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు మేరుగు జంపన్న తెలిపారు. జిల్లా కన్వీనర్‌గా ముత్యాల స్వామి, కో-కన్వీనర్‌గా గురిజాల బుచ్చిరెడ్డి, కన్వీనర్‌లుగా జంగ్ లావణ్య శ్రీనివాస్, గుర్రపు తిరుపతి, సింహరాజు క్రాంతి, కందరి ముత్యపురెడ్డిలను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధిలో ఉపసర్పంచ్‌ల పాత్ర, సంఘ బలోపేతంపై చర్చించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు కటుకం స్వప్న, రాష్ట్ర నాయకుడు ఎండీ రఫీ తదితరులు పాల్గొని ఉపసర్పంచ్‌ల ఐక్యతతో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News12 hours agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News7 days agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB6 days agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
