News
జగిత్యాల సభలో కేసీఆర్ ఫైర్, కాంగ్రెస్ పై తీవ్రవాక్యలు
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
బిబిఎంఏ న్యూస్ / జగిత్యాల
ఏప్రిల్ 20: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
సభలో ఘాటుగా స్పందించిన కేసీఆర్, “పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను” అంటూ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలను ఖండిస్తూ, “ఈ ఎదవలు చావాలంటే కేసీఆర్ చస్తాడా?” అంటూ ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ తనను రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా గానీ దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించామని, దీని వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. రైతులు ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించామని కేసీఆర్ పేర్కొన్నారు. “ఐదేళ్లలో పూర్తి చేయకపోతే ఎన్నికల్లో నిలబడమని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం” అని అన్నారు. ప్రస్తుతం తాగునీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పోరాటానికి సిద్ధంగా ఉండాలి
ప్రజలు తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. “మంచి మాటతో వినకపోతే కఠినంగా పోరాడాలి” అని సూచించారు. వ్యక్తిగత విమర్శలపై స్పందిస్తూ ప్రజల మద్దతు ఉన్నంతకాలం తనకు ఎలాంటి భయం లేదన్నారు.
వయస్సు వ్యాఖ్యలపై స్పందన
కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించిన కేసీఆర్, వయస్సు ఆధారంగా నాయకత్వాన్ని అంచనా వేయడం సరికాదన్నారు. “నాకు 72 ఏళ్లు, ఆయనకు 75 ఏళ్లు. వయస్సు కాదు, పని చేయాలనే తపన ముఖ్యం” అని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్తుపై వ్యాఖ్యలు
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు గర్వంగా జీవించే వరకు పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. “ఇది మా తెలంగాణ అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పే రోజు వచ్చే వరకు పని చేస్తాం. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేయడమే నా లక్ష్యం” అని పేర్కొన్నారు.
జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలతో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభకు భారీగా ప్రజలు హాజరై కేసీఆర్ ప్రసంగానికి మద్దతు తెలిపారు. పార్టీ కార్యకర్తలు నినాదాలతో సభను ఉత్సాహభరితంగా మార్చారు.
మొత్తంగా, జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడు పెంచినట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
crime
లైసెన్సు లేని బేకరీకి రూ.10 వేల జరిమానా.. నాసిరకం ఆహార విక్రయాలపై రూ.75 వేల ఫైన్
భూపాలపల్లి /బిబిఏంఏ న్యూస్/జులై 30: గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆహార భద్రతా అధికారి వరుణ్ రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టారు. లైసెన్సు లేకుండా బేకరీ నిర్వహిస్తున్న నిర్వాహకుడికి రూ.10 వేల జరిమానా విధించారు. అలాగే వేరుశెనగలు, శనగపప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ తదితర నాసిరకం ఆహార పదార్థాలను విక్రయిస్తున్న పలు దుకాణాలు, రిలయన్స్ స్టోర్‌తో పాటు కొన్ని రెస్టారెంట్లపై మొత్తం రూ.75 వేల జరిమానా విధించారు. ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్సు పొందాలని, నాణ్యమైన, కల్తీ లేని ఆహార పదార్థాలనే ప్రజలకు అందించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
End
News
కుమార్తెలను హాస్టల్‌లో దింపి వస్తూ విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కుమార్తెలను హాస్టల్‌లో దింపి వస్తూ విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృత
మహాముత్తారం / బీబీఎంఏ న్యూస్ / జూలై 30: మండలంలోని స్తంభాపల్లి పీకే గ్రామానికి చెందిన కోడి సుగుణ (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, జూలై 29న కోడి సుగుణ తన ఇద్దరు కుమార్తెలను కాటారం హాస్టల్‌లో దింపి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. బోర్లగూడెం గ్రామానికి చేరుకున్న అనంతరం తన గ్రామానికి వరసకు అల్లుడైన ఒళ్లల రమణయ్య బైక్‌పై ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఎద్దును బైక్ ఢీకొనడంతో ఇద్దరూ కిందపడిపోయారు.
ఈ ప్రమాదంలో కోడి సుగుణ తలకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మృతురాలి భర్త కోడి పోషం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ డి. రాజయ్య వివరాలు వెల్లడించారు. గ్రామంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపగా, స్థానికులు మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
News
తెలంగాణ ఉద్యమం నుంచి ఎమ్మెల్యే వరకు.. పెద్ది సుదర్శన్ రెడ్డి జీవన ప్రస్థానం
రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో ముద్ర వేసిన నేత
పూర్తి పేరు: పెద్ది సుదర్శన్ రెడ్డి
తండ్రి పేరు: రాజి రెడ్డి
రాజకీయ పార్టీ: భారత్ రాష్ట్ర సమితి (BRS)
నియోజకవర్గం: నర్సంపేట, వరంగల్ జిల్లా, తెలంగాణ
వ్యక్తిగత వివరాలు…
పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవసాయ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. 1991లో వరంగల్ మహబూబియా పంజతన్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగిస్తూ రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. ఆయన సతీమణి నల్లబెల్లి ప్రాంతంలో జెడ్పీటీసీ సభ్యురాలిగా సేవలందించారు.
రాజకీయ ప్రస్థానం…
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, ఉద్యమ నాయకుడిగా ప్రజలకు చేరువయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో పరాజయం పొందారు.
ఎమ్మెల్యేగా చేసిన ముఖ్య పనులు…
* గ్రామీణ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
* తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
* విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సహకరించారు.
* నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుపై దృష్టి సారించారు.
2023 ఎన్నికల అఫిడవిట్ వివరాలు
వయస్సు: 49 సంవత్సరాలు
మొత్తం ఆస్తులు: సుమారు ₹2.33 కోట్లు
అప్పులు: సుమారు ₹11 లక్షలు
– వృత్తి: మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయదారుడు
– క్రిమినల్ కేసులు: ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేసులు లేవు.
రాజకీయ శైలి…
పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా పేరుపొందారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, బీఆర్ఎస్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుని 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వ్యవసాయ రంగంతో అనుబంధం ఉండటంతో రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన నాయకుడిగా స్థానికంగా గుర్తింపు పొందారు.
-
crime4 weeks agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
News2 weeks agoపట్టణాభివృద్ధికి ఆదర్శంగా సహేందర్ రెడ్డి.. స్వచ్ఛందంగా నిర్మాణం తొలగింపు
-
crime2 weeks ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana3 weeks agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
Andhra1 week agoబ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో గబ్బర్ సింగ్ రమేష్.. ఆరోగ్య పరిస్థితి విషమం
-
News4 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment3 weeks agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News3 weeks agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
