News
సీఎం పర్యటన … భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త్
సీఎం పర్యటనకు ముందస్తు సమీక్ష… భద్రతపై ప్రత్యేక దృష్టి ఎస్పీ సంకీర్త
కాలేశ్వరం/బీబీఎంఏ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాలేశ్వరంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లపై ఆదివారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి భూపాలపల్లి జిల్లాకు రానున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐఏఎస్,జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్, ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
సభ జరుగనున్న ప్రాంగణాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్ స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, వేదిక నిర్మాణం వంటి అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న బారికేడ్లు, స్టేజ్ సదుపాయాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలను కూడా పరిశీలించారు.
అదనంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
News
స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News
కేపీహెచ్‌బీలో బస్సు ఫైర్ ప్రయాణికులు సురక్షితం
కేపీహెచ్‌బీ / బీబీఎంఏ న్యూస్
హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
కేపీహెచ్‌బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లుకు వెళ్లాల్సిన ఈ బస్సు (నంబర్: NL02B9955)గా గుర్తించారు. బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.
డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
News
సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి
సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి
బీబీఎంఏ న్యూస్ / సుల్తానాబాద్, ఏప్రిల్ 14
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
News3 weeks agoరూ.4.65 లక్షలు ఎగ్గొట్టిన రిపోర్టర్ మోటపలుకుల వెంకట్ పై కేసు
-
Police News2 weeks ago🚨 BBMA POLICE e:NEWS – మా రిపోర్టర్లు & సహచర మీడియా జోలికి వస్తే తాట తీస్తాం
-
News2 days agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Police News3 weeks agoBBMA POLICE e:NEWS // ఆటిజం అవగాహన దినోత్సవం – సమానత్వానికి స్మైల్ స్పెషల్ స్కూల్ పిలుపు
-
india4 weeks agoమార్కాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…
-
Politics3 weeks agoBBMA POLICE E:NEWS// నెల్లూరు చిల్లకూరులో టీడీపీ నాయకుల రాసలీలలు కలకలం!!
-
News2 weeks agoజయంతి రోజే అవమానం..? మున్సిపల్ అధికారులపై ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
-
News4 weeks agoకాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన టి. జీవన్ రెడ్డి
