Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి

Published

on

గోదావరిఖని: గోదావరిఖని ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చైతన్య స్కూల్ టీచర్ గాజవేని వెన్నెల (26) మృతి చెందింది. ఎన్టీఆర్ నగర్ నుండి లక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూలుకు స్కూటీపై వెళ్తున్న సమయంలో గౌతమి నగర్ మూలమలుపు వద్ద వెనుక నుండి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వెన్నెల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కేపీహెచ్‌బీలో బస్సు ఫైర్ ప్రయాణికులు సురక్షితం

Published

on

కేపీహెచ్‌బీ / బీబీఎంఏ న్యూస్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

కేపీహెచ్‌బీ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలకొల్లుకు వెళ్లాల్సిన ఈ బస్సు (నంబర్: NL02B9955)గా గుర్తించారు. బస్సు వెనుక భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.

డ్రైవర్, సిబ్బంది చాకచక్యంగా స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడం ఊరటనిచ్చింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రావెల్స్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నట్లు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Continue Reading

News

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

Published

on

సుల్తానాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ నివాళి

బీబీఎంఏ న్యూస్ / సుల్తానాబాద్, ఏప్రిల్ 14

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు స్ఫూర్తిగా నిలిచారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి దేశానికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading

News

నంది మేడారం కోర్ట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Published

on

అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అడ్వకేట్స్ అసోసియేషన్

 

బీబీఎంఏ న్యూస్ / ధర్మారం, ఏప్రిల్ 14,

పెద్దపల్లి జిల్లా నందిమ్యాడారం కోర్టు ఆవరణలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను అడ్వకేట్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేసిన సేవలను వక్తలు స్మరించారు.

అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి బొట్ల లక్ష్మీనర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఆకారి రాజేశం, కోశాధికారి నూనే సత్యనారాయణ, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శి సంపత్ భీమారపు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నారా అశోక్ రెడ్డి, మహిళా న్యాయవాది రాగుల రజిత, కోర్టు పోలీస్ సంతోష్, కోర్టు ప్రాసెస్ సర్వర్ తేజతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. చివరగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు.

Continue Reading

Trending