Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

POLICE NEWS BBMA// కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభకు అభినందనలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రశంసలు

Published

on

POLICE NEWS BBMA// కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభకు అభినందనలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రశంసలు

POLICE NEWS BBMA// కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభకు అభినందనలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రశంసలు

జగిత్యాల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) ఇంటర్మీడియట్ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించాయి. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్. లతతో కలిసి అభినందించారు. ద్వితీయ సంవత్సరంలో రాయికల్ KGBVకు చెందిన ఎస్. శృతి 1000 మార్కులకు 988 మార్కులు సాధించగా, ప్రథమ సంవత్సరంలో కె. కార్తీక 500లో 492 మార్కులు సాధించారు.

జిల్లాలోని 12 KGBVలలో ప్రథమ సంవత్సరంలో 89.52% మరియు ద్వితీయ సంవత్సరంలో 92.72% ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థినుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత, తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేత విద్యార్థినులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె. రాము తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Police News

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

Published

on

By

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

POLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు

జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక “సేవా పథకం”లకు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన 10 మంది అధికారులు, సిబ్బంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.

విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు సహజంగానే లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు చట్టపరిధిలో ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్నత విలువలతో విధులు నిర్వర్తించే వారికి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల ప్రశంసలు దక్కుతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ప్రతిష్టాత్మక సేవా పథకాలకు ఎంపిక కావడం ప్రతి పోలీస్ అధికారికి గౌరవప్రదమైన విషయమని, ఈ అవార్డులు శాఖలోని ఇతర సిబ్బందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.

సేవా పథకాలకు ఎంపికైన వారిలో ఇన్‌స్పెక్టర్ అరీఫ్ అలీ ఖాన్, ఏఆర్‌ఎస్‌ఐ టి. సూర్య ప్రకాష్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు మొహమ్మద్ అబ్దుల్ కలీమ్, పీ. రాజయ్య, ఆర్. నర్సింగరావు, సీహెచ్. శేఖర్, ఆర్. శేఖర్, ఎ. శ్రీనివాస్ మరియు కానిస్టేబుళ్లు ఎం. కిరణ్ కుమార్, కె. జలపతి ఉన్నారు. ఎంపికైన అధికారులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Continue Reading

News

తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం: సీపీ అంబర్ కిషోర్ ఝా

Published

on

 

రామగుండం, జూన్ 2 ( బిబిఎంఏ న్యూస్):

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఎందరో అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను సీపీ ప్రదానం చేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, వివిధ విభాగాల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ నితికా పంత్

Published

on

బీబీఎంఏ న్యూస్ / ఆసిఫాబాద్

కొమురం భీం ఆసిఫాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నితికా పంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సేవా పథకాలు, ప్రశంసా పత్రాలను ఎస్పీ నితికా పంత్ అందజేశారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఎస్పీ, ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending