Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Police News

BBMA POLICE e:NEWS // పత్రిక ప్రకటన హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు – ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS

Published

on

BBMA POLICE e:NEWS // పత్రిక ప్రకటన హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు – ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS

BBMA POLICE e:NEWS // పత్రిక ప్రకటన
హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్రలకు పటిష్ట బందోబస్తు – ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS

జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా
పత్రిక ప్రకటన తేది: 01.04.2026
• హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
• ప్రశాంత వాతావరణంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర నిర్వహించాలి – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ IPS
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఏప్రిల్-02 హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ప్రజలకు ముందస్తుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే శోభాయాత్ర రోడ్డు మార్గాలను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు. శోభాయాత్రలు ప్రశాంతంగా జరగడానికి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
జిల్లా నలుమూలల, ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, నిరంతరం పెట్రోలింగ్ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శోభాయాత్ర నిర్వాహకులకు సూచనలు:
• ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పెద్ద శబ్దాలతో కూడిన డీజేలను ఉపయోగించకూడదు
• ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా వివాదాస్పద పాటలు, నినాదాలు, ప్రసంగాలు చేయకూడదు
• ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సహనంగా ప్రవర్తించాలి
సామాజిక మాధ్యమాలలో వచ్చే రూమర్లు, అనవసర పోస్టులను నమ్మవద్దని ఎస్పీ గారు సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా రూమర్లను వ్యాప్తి చేస్తే అట్టి వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

వేములవాడలో దొంగతనం కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Published

on

 BBMA NEWS:

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులైన బోడసు అశోక్, దుండగల ప్రవీణ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి దొంగిలించబడిన 3.6 గ్రాముల బంగారం, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, పోలీసుల చాకచక్యమైన దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

కేసును వేగంగా ఛేదించి దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్న వేములవాడ పట్టణ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

News

భద్రాచలంలో పోలీసుల విస్తృత తనిఖీలు.. లాడ్జీలు, బస్టాండ్ ప్రాంతాల్లో డీఎస్పీ అరుణ్ కుమార్ పరిశీలన

Published

on

భద్రాచలం, BBMA NEWS:

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భద్రాచలం సబ్ డివిజనల్ డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానితులను గుర్తించే లక్ష్యంతో భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, బస్టాండ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న వారి వివరాలను తనిఖీ చేయడంతో పాటు నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న అనుమానితులపై నిఘా పెట్టి వారి వివరాలను సేకరించారు.

 

ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై సమాచారం అందించాలని కోరారు.

Continue Reading

News

మైనర్లకు పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం.. కురవిలో పోలీసుల డికాయ్ ఆపరేషన్

Published

on

BBMA NEWS ఆర్టికల్:

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కురవి గ్రామంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కురవి, పోలీసు సిబ్బందితో కలిసి 2 పాన్ షాపులు, 6 టీ స్టాళ్లు, 21 కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. మైనర్లకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా దుకాణ యజమానులకు చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Continue Reading

Trending