News
ఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
ఎండపల్లి, మే 15 (బిబిఎంఎ న్యూస్
(రాష్ట్ర రహదారి 7)పై వరుసగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ప్రాణనష్టంపై బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొమ్ము రాంబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఇటీవల అంబరిపేట, రాయపట్నం ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఈ రహదారి “మరణశాల”గా మారుతోందని అన్నారు. ఈ ప్రమాదాల్లో పేదలు ప్రాణాలు కోల్పోవడంతో పాటు, పలువురు శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రాజీవ్ రహదారి 7ను తక్షణమే ఫోర్‌లేన్‌గా విస్తరించాలని, ప్రమాదాల నివారణకు రహదారి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలమయంగా మారిన రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.
ఇటీవల రాయపట్నం వద్ద జరిగిన ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, పుష్కరాల నాటికి రవాణా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర రహదారి– 7 పై డివైడర్ల ఏర్పాటు, ఫోర్‌లేన్ విస్తరణ పనులు ప్రారంభించకపోతే ప్రజల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కొమ్ము రాంబాబు హెచ్చరించారు.
News
ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణే ధ్యేయం
బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున బస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించి, కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నిర్మూలన సాధ్యమని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలనీల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 20 మంది పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Andhra
రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ
రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం.. సీపీ చొరవతో వ్యక్తి ప్రాణాలు రక్షణ
బిబిఎం ఏ న్యూస్ / విశాఖపట్నం
విశాఖపట్నంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నగర పోలీసుల అప్రమత్తతతో సురక్షితంగా రక్షించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ప్రజలకు అందుబాటులో ఉంచిన 7995095799 నంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి, విశాఖ రైల్వే స్టేషన్ 8వ ప్లాట్‌ఫాం సమీపంలో ఓ వ్యక్తి ట్రాక్‌పై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన సీపీ రైల్వే పోలీసులను అప్రమత్తం చేయగా, వారు ఘటనాస్థలికి చేరుకొని ట్రాక్‌పై ఉన్న వ్యక్తిని క్షణాల్లో రక్షించారు. అనంతరం బాధితుడికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఫోన్ చేసిన వెంటనే స్పందించి తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు కాపాడినందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి గారికి బాధితుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నగర పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
crime
ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : డీసీపీ భాస్కర్
మంచిర్యాల, మే 14 (బిబిఎంఏ న్యూస్): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో గురువారం ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు చట్టబద్ధంగా జీవనం సాగించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు ఇంట్లోని బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆరు ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
crime4 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment5 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime4 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime1 day agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
