Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

crime

చర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..

Published

on

ప్రమాదమా? హత్యా? దర్యాప్తు కొనసాగింపు

బిబిఎంఏ న్యూస్ /

ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలో నడిరోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఎర్రవెల్లి పార్శారం‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై మొదట హత్య అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలానికి సమీపంలో నిలిపివున్న కారువద్ద పోలీస్ డాగ్ ఆగడంతో కేసుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ సందర్భంగా జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. ప్రారంభంలో హత్య కోణంలో దర్యాప్తు చేపట్టామని, అయితే ప్రాథమిక విచారణలో ఇది రోడ్డు ప్రమాదంగా భావిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

crime

ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : డీసీపీ భాస్కర్

Published

on

మంచిర్యాల, మే 14 (బిబిఎంఏ న్యూస్): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో గురువారం ఆకస్మికంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులపై పోలీసుల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఇళ్ల యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు చట్టబద్ధంగా జీవనం సాగించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే వారు ఇంట్లోని బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆరు ప్రకాష్, రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, ఎస్సై శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

crime

అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

Published

on

 

బిబిఎంఏ న్యూస్: పెద్దపల్లి( ఓదెల)

అత్యాచార కేసులో నేరం రుజువుకావడంతో ఓదెల మండలానికి చెందిన మాచర్ల అలియాస్ రాచర్ల రాయమల్లుకు పెద్దపల్లి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధించింది.

2024 ఏప్రిల్ 23న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించిన పీపీ డొంకెన రవీందర్‌తో పాటు దర్యాప్తు అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Continue Reading

crime

బీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు

Published

on

హైదరాబాద్, బిబిఎంఏ న్యూస్:

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ దారుణ ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు యవన్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఏర్పడిన పాత కక్షలే హత్యకు కారణమని తేలింది. నిందితులు ముందుగా పథకం రచించి మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో యవన్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు ద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారికి కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending