Telangana
ఎలిఫెంట్ ఎన్‌క్లేవ్‌లో రూ.55 లక్షల సీసీ రోడ్డుకు ప్రారంభించిన తోటకూర అజయ్ యాదవ్
ఘట్‌కేసర్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్‌లో ఉన్న ఎలిఫెంట్ ఎన్‌క్లేవ్ కాలనీలో రూ.55 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును బోడుప్పల్ మాజీ మేయర్, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ కాలనీల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు వల్ల కాలనీవాసులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పంబాల రమేష్, జీవన్ రెడ్డి, పరవత్ రెడ్డి, మంచాల ప్రవీణ్, మద్ది రెడ్డి వెంకట్ రెడ్డి, పొట్ట శ్రీశైలం, భూమయ్య యాదవ్, బాలరాజ్ యాదవ్, అన్నంరాజు సురేష్, పొట్ట విఘ్నేశ్వర్, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి, వినోద్, సుమతి హరిదాసన్, కాలనీ ప్రెసిడెంట్ వాసు, ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రాజు, కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
కార్పొరేట్లకు రాయితీలు.. ప్రజలకు పన్నుల భారం: కలవేన శంకర్
హెడ్
మంచిర్యాల, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్):
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా సామాన్య ప్రజలపై పన్నుల భారం పెరుగుతుండగా, కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవనం భారంగా మారిందన్నారు.
ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ సరుకులు అందించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్లబజారు, కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
News
గాంధీనగర్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
మెదక్, జూన్ 10 (బీబీఎంఏ న్యూస్): ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, నేరాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా మెదక్ జిల్లా పోలీసులు గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత, పిల్లల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంలోని ముఖ్యాంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని సూచించారు.
అదే విధంగా వాహనాల తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 45 వాహనాలను గుర్తించి తాత్కాలికంగా సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.
ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Telangana
POLICE E:NEWS BBMA// డిఫెన్స్ ఉద్యోగాల్లో తేజస్ అకాడమీ ఘన విజయం – 160 మందికి ఉద్యోగాలు
POLICE E:NEWS BBMA// డిఫెన్స్ ఉద్యోగాల్లో తేజస్ అకాడమీ ఘన విజయం – 160 మందికి ఉద్యోగాలు
కరీంనగర్‌లోని తేజస్ అకాడమీ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఇటీవల విడుదలైన డిఫెన్స్ నియామక ఫలితాల్లో అకాడమీకి చెందిన 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు చైర్మన్ సి.హెచ్. సతీష్ రావు తెలిపారు. జూన్ 2025లో నిర్వహించిన హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల్లో 156 మంది ఇండియన్ ఆర్మీలో, 3 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీరులుగా ఎంపికయ్యారు. ఇండియన్ ఆర్మీలో జీడీ విభాగంలో 131 మంది, ట్రేడ్స్‌మెన్‌లో 12 మంది, టెక్నికల్‌లో 13 మంది ఎంపిక కాగా, ఎయిర్ ఫోర్స్‌లో ముగ్గురు నాన్-టెక్నికల్ విభాగంలో ఎంపికయ్యారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని “తేజస్ శౌర్య–2026” కార్యక్రమాన్ని నిర్వహించి ఎంపికైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. జూన్ 8 నుంచి వారు తమ ట్రైనింగ్ సెంటర్లలో రిపోర్ట్ చేయనున్నారు. డిఫెన్స్ రంగంతో పాటు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తూ తేజస్ అకాడమీ విశేష ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు 2,000 మందికి పైగా విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినట్లు సతీష్ రావు వెల్లడించారు.
-
News4 weeks agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News7 hours agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
Telangana3 weeks agoబీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
-
crime4 weeks agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News3 weeks agoమంథని ఆర్టీసీ బస్టాండ్‌లో కలుషిత తాగునీటి వ్యవస్థపై ప్రయాణికుల ఆగ్రహం
-
News7 days agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB6 days agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News1 week agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
