Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Andhra

🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Published

on

🔴 BBMA NEWS సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

BBMA NEWS POLICE E:NEWS//

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.

#AndhraPradesh

 

– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Andhra

మాదిగలకు ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలి: ఎమ్మార్పీఎస్

Published

on

హామీ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిక

కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: 2024 ఎన్నికల సమయంలో మాదిగలకు ఒక ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. బుధవారం కాకినాడ కచేరిపేట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ మాట్లాడుతూ, ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని మాదిగలకు కేటాయించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సూచనల మేరకు టీడీపీ విజయానికి కృషి చేశామని, ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించడం బాధాకరమన్నారు. నాలుగు రోజుల్లో సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగల సత్తా చాటుతామని పేర్కొన్నారు. సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి పసుపులేటి చిన్నబాబు మాదిగ అధ్యక్షత వహించగా, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

Andhra

పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేత అందించాలి: కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

Published

on

అందుబాటు ధరల్లో పశుదాణ సరఫరాకు ప్రత్యేక చర్యలు – సహకార సంఘాలతో సమన్వయంపై అధికారులకు ఆదేశాలు

అమలాపురం / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశువుల మేతను సకాలంలో, అందుబాటు ధరలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో సాయి శివ హోమ్ క్యాటిల్ ఫీడ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పశుదాణ నాణ్యత, పాల ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంఓయూ ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన పశుదాణ అందించి పాల ఉత్పత్తి పెంపునకు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 150 టన్నుల పశుదాణ ఉత్పత్తి చేసినట్లు పేర్కొంటూ, సెప్టెంబర్‌తో ముగియనున్న ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు పశుదాణ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Continue Reading

Andhra

నషా ముక్త్ భారత్‌కు 10 కోట్ల సంతకాల మహోద్యమం: బ్రహ్మాకుమారీస్

Published

on

మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనే లక్ష్యం – ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపు

కాకినాడ / బీబీఎంఏ న్యూస్ / ఆగస్టు 5: ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల సంతకాల సేకరణ మహోద్యమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు, తల్లిదండ్రుల్లో మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. మత్తు పదార్థాల వ్యసనం సమాజంలో వేగంగా విస్తరిస్తూ యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల సమాజం, రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజ శ్రేయస్సు కోసం చేపడుతున్న ఈ 10 కోట్ల సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములై, మత్తు రహిత భారత నిర్మాణానికి సహకరించాలని బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Continue Reading

Trending