Telangana
బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య
బిబిఎంఏ న్యూస్ / సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా యార్కరం గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
పాత కక్షలు, రాజకీయ విభేదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్య అనంతరం మధు మృతదేహాన్ని యార్డ్ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, మొబైల్ ఫోన్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మధుతో సన్నిహితంగా ఉన్న కొందరిని విచారిస్తున్నట్లు సమాచారం. భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత విభేదాల కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News
బయట ధరల కంటే రూ.10 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపణ.. డిపో అధికారులకు ఫిర్యాదు
జూలై 15 (బీబీఎంఏ న్యూస్):కరీంనగర్ ఆర్టీసీ డిపో బస్‌స్టాండ్ ఆవరణలోని దుకాణాల్లో వినియోగదారుల నుంచి వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త గోనె మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై డిపో అసిస్టెంట్ మేనేజర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.
బయట మార్కెట్‌లో రూ.10కు లభించే ఇండిపెండెంట్ గోల్డ్ కంపెనీ నీటి బాటిల్‌ను బస్‌స్టాండ్‌లోని దుకాణాల్లో రూ.20కు విక్రయిస్తున్నారని, అలాగే టాటా ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను కూడా మార్కెట్ ధర కంటే రూ.10 అధికంగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దుకాణ సిబ్బందే చెబుతున్నారని ఆయన అన్నారు.
బస్‌స్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, సామాన్య ప్రజలు అధిక ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అన్ని వస్తువులను ముద్రిత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) లేదా బయట మార్కెట్ ధరలకు అనుగుణంగా విక్రయించేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గోనె మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దుకాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News
జన్మదినం సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
క్యాతనపల్లి , జూలై 14 (బీబీఎంఏ న్యూస్):గోదావరిఖనికి చెందిన సామాజిక సేవకుడు మీసాల సతీష్ కుమార్ 40వ జన్మదినం సందర్భంగా క్యాతనపల్లి సూపర్ బజార్ సెంటర్‌లో పదిమంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జంతు ప్రేమికుల సంఘం అధ్యక్షుడు బాబురావు కోల శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ గుడిసెల సంధ్యారాణి, రాజా రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. కేశవరపు సత్య, వెంకట్, నిమ్మల సంతోష్ రెడ్డి, హర్ష్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Entertainment
ఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ పిలుపు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్థానిక ఐబీ కాలనీ లో వెలసిన శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆషాడ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ గుర్రాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రావుల స్వరాజ్ పాల్గొని మాట్లాడుతూ.. పెద్దమ్మతల్లి ఆలయం & నాగదేవత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 15 బుధవారం నుండి నెల రోజులపాటు నిర్వహించు ఆషాడ మాస శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో ముదిరాజ్ కులస్తులు, బంధువులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి కృపను పొందగలరని ఆలయ కమిటీ కోరుతుంది. భక్తులకు ఎలాంటి ఆసౌకర్యార్థం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు అప్పరాజు ప్రభాకర్, బర్ల మల్లయ్య, ఇస్తారి, శీలం శ్రీనివాస్, చిగురు సాయి, చొప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-
crime1 week agoలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్
-
crime2 days ago2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో మున్సిపల్ ఏఇ సతీష్
-
Telangana4 days agoబిబిఎంఏ వార్తతో కదిలిన మున్సిపాలిటీ.. ముత్యాలమ్మవాడలో డ్రైనేజీల శుభ్రత
-
News2 weeks agoచంద్రబోస్ చేతుల మీదుగా ‘అనిత ఓ అనిత–3’ పోస్టర్ ఆవిష్కరణ
-
Entertainment3 days agoఈనెల 15 నుండి పెద్దమ్మ తల్లి బోనాల జాతర…
-
News5 days agoవెల్గటూర్ అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-
News4 days agoరాంపల్లి భూములను కాపాడాలి.. ప్రభుత్వానికి ఎంపీ ఈటెల హెచ్చరిక
-
News2 weeks agoసహజీవనానికి వివాహ హోదా లేదు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
