ACB
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దవంగర తహసీల్ధార్ వీరగంటి మహేంద్ర,
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దవంగర తహసీల్ధార్ వీరగంటి మహేంద్ర,
బిబిఎంఏ న్యూస్/ పెద్ద వంగర :
నవంబర్ 28: మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహశీల్దారు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వీరగంటి మహేంద్ర, ఫిర్యాదుధారురాలి భర్తకు మామ వారసత్వ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుకూలంగా ప్రాసెస్ చేయించడానికి ఫిర్యాదుధారురాల నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, తన ప్రైవేట్ డ్రైవర్ తుప్పాని గౌతమ్ ద్వారా తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
తెలంగాణ అవినీతినిరోధక శాఖ ప్రజలకు హెచ్చరిస్తోంది: ఏ ప్రభుత్వ ఉద్యోగి #లంచం అడిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయండి. అదనంగా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), X (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు అందజేయవచ్చు.
అందించిన ఫిర్యాదు గోప్యంగా ఉంచబడుతుందని అన్నారు.
ACB
కామారెడ్డి తహసీల్దారు లంచం కేసులో అరెస్టు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలంలో తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుని నాన్న గారి పేరులో ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుని పేరుకు మార్చేందుకు అనుకూల నివేదికను సంబంధిత అధికారులకు పంపించే ప్రతిపాదనతో ₹50,000/- రూపాయల లంచాన్ని ఒక ప్రయివేటు వ్యక్తి చిన్నూరి అజయ్ సహాయంతో స్వీకరించడంతో ఈ కుంభకోణం బయటపడింది. ఈ మొత్తం ఘటనపై తెలంగాణ అన్‌ఛా అధికారుల పర్యవేక్షణలో విచారణ జరపబడింది.
ఈ కేసు అధికారులు అవినీతి నిరోధక చర్యల్లో ఎంతగా కఠినంగా వ్యవహరిస్తున్నారో నిరూపిస్తోంది. ప్రజలకు న్యాయం అందించేందుకు, అవినీతి కట్టడి చేయడానికి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేస్తున్న కృషి అందరికీ స్పష్టమవుతోంది. లంచం తీసుకునే విధానాలను ఎవరైనా పాటిస్తే, వారిపై తగిన శిక్ష తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ చర్యలకు మద్దతుగా తమ వైపు నుండి సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఈ సంఘటన స్థానిక పరిపాలన వ్యవస్థలో అవినీతి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దృఢమైన సందేశం అయింది. తద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ అధికారం కృషి చేస్తోంది. లంచ దందా వంటి అసాంఘిక వ్యవహారాలపై దృష్టి సారించడం ద్వారా సమాజంలో పారదర్శకత పెంపొందించడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
ACB
ఏలూరు ఏసీబీ డీఎస్పీగా జి.వి. కృష్ణారావు బాధ్యతల స్వీకరణ
ఏలూరు జిల్లా…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా జి.వి. కృష్ణారావు ఏలూరు లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఎస్‌ఐ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పనిచేశారు. తదనంతరం పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, పెరవలి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. తరువాత సిఐగా పదోన్నతి పొంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో, జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరోలోపనిచేశారు. 2020 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఏలూరు ఇంటెలిజెన్స్ ఆఫీసులో డిఎస్పీగా పనిచేసి తరువాత పాలకొండ SDPO గా, APSP 8th బెటాలియన్ లో DSP గాపనిచేసి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) డీఎస్పీగా, ఏలూరు కార్యాలయములో బాధ్యతలు స్వీకరించినారు. అవినీతి సమాచారం పై ప్రజలు నిర్భయముగా ఫోన్ ద్వారా కానీ, ఆఫీసుకు వచ్చిగాని తెలియజేయవచ్చని కోరినారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని అంతే కాకుండా DSP గారి మొబైల్ నెంబర్ 9440441657 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతాము అని తెలియజేసినారు…
ACB
బిల్లుల ప్రాసెసింగ్ పేరుతో సీనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్
బాధితుడి యొక్క GPF, సరెండర్ లీవ్, మరియు FTA (ఫిక్స్‌డ్ ట్రావెలింగ్ అలవెన్స్) బిల్లులను ముందుగా తయారు చేసినందుకు గాను మరియు ఇప్పుడు వైద్య చెల్లింపు బిల్లులను తయారు చేయడం కోసం, భీమన్న, సీనియర్ అసిస్టెంట్, PHC బాసర I/C PHC తానుర్ gaaru రూ. 9000/లు లంచం డిమాండ్ చేసి, ఫోన్ పే ద్వారా తీసుకున్నారు.
-
crime2 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News3 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment3 days agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime2 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
News1 week agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
-
Entertainment3 days agoతమిళనాడులో కొత్త శకం.. సీఎం విజయ్ ఘనంగా ప్రమాణ స్వీకారం
