Police News
కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’
కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’
●నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక
●హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్
●నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ
కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు.
చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను సమీక్షిస్తూ.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, అవి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.
కేసుల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి కేసుకు ఒక స్పష్టమైన ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్, మహిళా భద్రత, స్ట్రీట్ క్రైమ్, ఆహార కల్తీ కేసులపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించారు.
రౌడీ షీటర్లు, పాతనేరస్తులపై నిఘా పెంచాలని తమ పరిధిలో ఎలాంటి నేరాలను జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్.హెచ్.ఓలదే అని స్పష్టీకరించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై పి.డి.యాక్ట్ పెట్టాలని ఆదేశించారు.
సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి దర్యాప్తు పూర్తి చేయాలని, తద్వారా శిక్షల శాతం (కన్విక్షన్ రేట్) పెంచేలా ప్రణాళికలు ఉండాలన్నారు. కఠిన శిక్షలు పడినప్పుడే నేరస్తుల్లో భయం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు సమాజములో పెరిగి పోతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తూ , వాటిని అదుపు చేసే విధంగా సాంకేతికతను పెంపోందించుకోవాలని, నిపుణుల సహాయముతో కేసులను దర్యాప్తు చేయాలని సూచించారు.
పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తప్పనిసరిగా వెపన్ తమ వెంట ఉంచుకోవాలని ఆదేశించారు. దీనికోసం ప్రతి 15 రోజులకోసారి వెపన్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ప్రతి అధికారి తమ పరిధి (జురిస్డిక్షన్)పై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని, ఎస్‌హెచ్‌ఓలు కింది స్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ నెలవారి నేర సమీక్ష సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ శ్రీనివాసులు, ఐపీఎస్ తోపాటు వివిధ విభాగాలు, జోన్ల డీసీపీలు శ్రీమతి కె.అపూర్వా రావు ఐపీఎస్, శ్రీమతి శ్వేత ఐపీఎస్, శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్, శ్రీమతి ఎస్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్, శ్రీమతి కె.శిల్పావళి ఐపీఎస్, సి.రూపేశ్ ఐపీఎస్, శ్రీ.కె.కిరణ్ ప్రభాకర్ ఐపీఎస్, శ్రీ.బి.బాలస్వామి ఐపీఎస్, శ్రీ.జి.చంద్రమోహన్, సిహెచ్.శ్రీనివాస్, శ్రీ.వి.అరవింద్ బాబు, శ్రీమతి పి.లావణ్య నాయక్ జాదవ్ తో పాటు అన్ని అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్ హెచ్ వోలు పాల్గొన్నారు.
Police News
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
POLICE E:NEWS BBMA// ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟ୍ ଠାବ, ୧୩୧ କେଜିରୁ ଅଧିକ ଗଞ୍ଜେଇ ଜବତ
ଓଡ଼ିଶା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ଗ୍ରାମୀଣ ଥାନା ପୋଲିସ ଏକ ବଡ଼ ଆନ୍ତର୍ରାଜ୍ୟ ଗଞ୍ଜେଇ ଚୋରାଚାଲାନ ରାକେଟକୁ ଠାବ କରିଛି। ଝାଡ଼ଖଣ୍ଡକୁ ଚୋରାଚାଲାନ ହେଉଥିବା ୧୩୧.୩୪୦ କିଲୋଗ୍ରାମ ଗଞ୍ଜେଇ ଜବତ କରାଯାଇଛି। ଅଭିଯାନ ସମୟରେ ଗଞ୍ଜେଇ ପରିବହନରେ ବ୍ୟବହୃତ ଏକ କାର, ତିନୋଟି ନମ୍ବର ପ୍ଲେଟ୍ ଏବଂ ଅନ୍ୟାନ୍ୟ ଆପତ୍ତିଜନକ ସାମଗ୍ରୀ ମଧ୍ୟ ଜବତ ହୋଇଛି। ଏହି ଘଟଣାରେ ଦୁଇଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରାଯାଇ PS କେସ୍ ନଂ 135/26 ଅନୁଯାୟୀ ଅଦାଲତକୁ ପଠାଯାଇଛି। ନିଶାଦ୍ରବ୍ୟ ବିରୋଧୀ ଅଭିଯାନ ଜାରି ରହିବ ବୋଲି ପୋଲିସ ସୂଚନା ଦେଇଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
POLICE E:NEWS BBMA// ଯୁକ୍ତ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନରେ ମାଓବାଦୀ ଡମ୍ପ ଉଦ୍ଧାର
ରାୟଗଡା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ଗୁପ୍ତ ସୂଚନା ଆଧାରରେ ରାୟଗଡା ପୋଲିସ ଡିଭିଏଫ (DVF) ଓ ଏସଓଜି (SOG) ଦଳ ସହ ମିଳି ଅମ୍ବାଦୋଳା ଥାନା ଅନ୍ତର୍ଗତ ଧେପାଗୁର୍ହା ସଂରକ୍ଷିତ ଜଙ୍ଗଲ ଅଞ୍ଚଳରେ ଏକ ବିଶେଷ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଚଳାଇଥିଲେ। ଅଭିଯାନ ସମୟରେ ଜଙ୍ଗଲ ଭିତରେ ଲୁଚାଇ ରଖାଯାଇଥିବା ଏକ ମାଓବାଦୀ ଡମ୍ପକୁ ଠାବ କରାଯାଇ ଉଦ୍ଧାର କରାଯାଇଛି। ଏହି ସଫଳ ଅଭିଯାନ ମାଧ୍ୟମରେ ମାଓବାଦୀ କାର୍ଯ୍ୟକଳାପକୁ ରୋକିବା ସହ ଅଞ୍ଚଳର ସୁରକ୍ଷା ବ୍ୟବସ୍ଥାକୁ ଆହୁରି ସୁଦୃଢ଼ କରାଯାଇଛି। ପୋଲିସ ପକ୍ଷରୁ ଅଞ୍ଚଳରେ ସର୍ଚ୍ଚ ଅଭିଯାନ ଓ ନଜରଦାରି ଜାରି ରହିଛି।
Police News
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
POLICE E:NEWS BBMA// ଡକାୟତି ପୂର୍ବରୁ ୫ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀ ଗିରଫ, ବଡ଼ ଅପରାଧ ଟଳିଲା
ରାଉରକେଲା, ଜୁନ 14 POLICE E:NEWS BBMA//
ବିଶ୍ୱସନୀୟ ସୂଚନା ଆଧାରରେ ସେକ୍ଟର-୩ ଥାନାର ରାତ୍ରିକାଳୀନ ପେଟ୍ରୋଲିଂ ଟିମ୍ ଏସଆଇ ଆର. କେ. ଭୁଏଙ୍କ ନେତୃତ୍ୱରେ ସେକ୍ଟର-୨ ର ଡିସୁଜା ସ୍କୁଲ ପଛପଟେ ଡକାୟତି ପାଇଁ ଯୋଜନା କରୁଥିବା ୫ ଜଣ ସଶସ୍ତ୍ର ଅପରାଧୀଙ୍କୁ ଗିରଫ କରିଛନ୍ତି। ଅଭିଯୁକ୍ତମାନଙ୍କ ନିକଟରୁ ତଳୱାର, କଟର, ଛୁରୀ, କୁରାଡ଼ି, ଲୁହା ରଡ଼, ସ୍କ୍ରୁ ଡ୍ରାଇଭର, ହାତୁଡ଼ି, ଲଙ୍କା ଗୁଣ୍ଡ, ଟର୍ଚ୍ଚ, ମାସ୍କ, ମୋବାଇଲ ଫୋନ ସହ ବିଭିନ୍ନ ସାମଗ୍ରୀ ଜବତ କରାଯାଇଛି। ପୋଲିସର ତ୍ୱରିତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଫଳରେ ଏକ ବଡ଼ ଅପରାଧ ଟଳିଯାଇଛି। ସମସ୍ତ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ କୋର୍ଟକୁ ପଠାଯାଇଛି।
-
News3 weeks agoఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జంపన్న నియామకం
-
News3 weeks agoఫోన్ కాల్‌తో బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి
-
ACB3 weeks agoజగిత్యాలలో ఏసీబీ వలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
-
Police News4 weeks agoPOLICE E:NEWS BBMA// జగిత్యాల పోలీసులకు రాష్ట్ర స్థాయి గౌరవం.. 10 మంది పోలీస్ అధికారులకు సేవా పథకాలు
-
News2 weeks agoఎం.డి. మునీర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
-
News4 weeks agoదొంగల ముఠా సంచారం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ధర్మారం పోలీసుల హెచ్చరిక..
-
News2 weeks agoనూతన పోలీస్ స్టేషన్ల భవనాల కోసం స్థలాల పరిశీలన.. సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం
-
Andhra4 weeks agoప్రభుత్వ వైద్యరంగంలో చరిత్ర సృష్టించిన నిమ్స్..
