News
గోరి కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం చర్లపల్లి వాసి మృతి, మరో ఇద్దరికి గాయాలు
గోరి కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం చర్లపల్లి వాసి మృతి, మరో ఇద్దరికి గాయాలు
బిబిఎంఏ న్యూస్ / నడికుడ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లిలో శ్మశాన వాటిక సమీపంలో ములుగు వెళ్ళే రోడ్డుపై ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం, మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొట్టిన ఘటనలో వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణిస్తున్న ముగ్గురు హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి వాసులు మోర దేశపతి మృతి చెందగా, మరో ఇద్దరిని తీవ్ర గాయాలయ్యాయి. వారిని వైద్యం సహాయం కోసం హాస్పిటల్ కి తరలించారు. పోలీసు అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Telangana
వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు..
వంతెనను ఢీకొట్టి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు..
డ్రైవర్, కండక్టర్ సహా 30 మందికి తీవ్ర గాయాలు
బిబిఎంఏ న్యూస్ / వెబ్ డెస్క్ – ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం పరిధిలోని షాంపూర్ గ్రామం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వంతెన (కల్వర్టు)ను ఢీకొట్టి కిందనున్న వాగులో పడిపోయింది.
ఈ బస్సు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినదిగా, ఆసిఫాబాద్ డిపో నుంచి బయలుదేరి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం… షాంపూర్ గ్రామం వద్ద వంతెన సమీపానికి చేరుకున్న వెంటనే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ముందున్న కల్వర్టును ఢీకొట్టి నేరుగా వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు కిటికీలు, తలుపుల గుండా ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేశారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు 108 అంబులెన్స్ సేవలు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తక్షణమే ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆదిలాబాద్కు తరలించే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదానికి డ్రైవర్‌కు నిద్రమత్తు కారణమా? లేక వాహనంలో సాంకేతిక లోపం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, సహాయక యంత్రాల సహాయంతో బస్సును వాగులో నుంచి తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Telangana
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
సెంటినరీ కాలనీలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య..
బిబిఎంఏ న్యూస్ | రామగిరి
రామగిరి మండలం పరిధిలోని సెంటినరీ కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ సమీపంలో బేగంపేట్ గ్రామానికి చెందిన మోలుగురి కోమురయ్య (58) హత్యకు గురయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, నారాయణపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య స్థానికంగా జరిగిన వివాహ కార్యక్రమానికి సెంటినరీ కాలనీకి వచ్చాడని తెలుసుకున్న బుర్ర రాజకోమురయ్య పాత కక్షల నేపథ్యంలో సత్తయ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో సత్తయ్యకు చేతికి గాయాలయ్యాయి.
సత్తయ్యను రక్షించేందుకు వచ్చిన అతని అన్న కోమురయ్యపై నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేయడంతో కోమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra
🔴 BBMA NEWS ప్రభుత్వ సేవల సరళీకరణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
�
BBMA NEWS POLICE E:NEWS//
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వివిధ ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో అవసరమైతే కొన్ని చట్టాలను కూడా సరళతరం చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. ఈ అంశాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. విజయానంద్‌తో పాటు పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెంచుతూ ప్రజాకేంద్రిత పాలన దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సూచించారు.
#AndhraPradesh
– V. Vamsi, Social Media Incharge, BBMA & BBMA POLICE E:NEWS
�
-
Politics2 weeks agoP. జలంధర్ రావు (మాజీ చైర్మన్, మీడియా విభాగం – తెలంగాణ యువజన కాంగ్రెస్) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకెళ్తుంది
-
News4 weeks agoవ్యాయామంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : విశాఖ సీపీ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్
-
Police News3 days agoBBMA POLICE E:NEWS పోలీస్ జాగిలం “రాఖీ”కి శిక్షణ పూర్తి సర్టిఫికెట్ అందజేత
-
Telangana2 weeks agoనేడే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
-
News3 weeks agoమేడారంలో మెరిసిన సంస్కృతి తార 🌟
-
News4 weeks agoBBMA NEWS : జనాల్లోకి వన దేవత… గద్దెపైకి సమ్మక్క!
-
Police News5 days agoBBMA POLICE E:NEWS పోలీసుల్లో నూతనోత్సాహం.. క్రీడల కోలాహలం
-
News7 days agoBBMA POLICE E:NEWS // గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
