Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

News

ఫేక్ లింకులు, ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండాలి : ఎస్ఐ ఉదయ్ కుమార్

Published

on

అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలి – జగిత్యాల పోలీసులు

బిబిఎంఏ న్యూస్ /ఎండపల్లి

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఓటీపీలు ఇతరులతో పంచుకోవడం, ఫేక్ లింకులు క్లిక్ చేయడం, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, ఆన్‌లైన్ లోన్లు, ఫేక్ జాబ్ ఆఫర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు.

యువతలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుతోందని, వాటి వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పోలీస్ కళాబృందం ప్రత్యేక ప్రదర్శనలు, పాటల ద్వారా సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రాత్రివేళల్లో దొంగతనాల నివారణ, మహిళలు, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ : సీపీ అంబర్ కిషోర్ ఝా

Published

on

బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Continue Reading

News

జివిటీసీ లో పనిచేయని ఫ్రిడ్జ్.. చల్లటి తాగునీరు లేక ఇబ్బందులు

Published

on

ఆర్జీ-1 ఏరియాలోని జీవీటీసీ (జీవీటీసీ ) కేంద్రంలో గత కొన్ని నెలలుగా ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో కార్మికులు, ట్రైనింగ్‌కు వచ్చే అభ్యర్థులు,ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో చల్లటి తాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడికి వచ్చే వారు అలమటిస్తున్నారని తెలిపారు.

ఈ సమస్యపై స్పందించిన సీఐటీయూ యంగ్ వర్కర్స్ కమిటీ నాయకులు, వెంటనే పనిచేయకుండా ఉన్న ఫ్రిడ్జ్‌కు మరమ్మత్తులు చేపట్టి కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యలు తీసుకోవాలని కోరారు.

Continue Reading

News

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపు

Published

on

బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని మే 16

పెద్దపల్లి జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు మద్దతుగా శనివారం పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12.40 లక్షల మెడికల్ షాపులు, ఫార్మసీలు బంద్‌లో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు.

ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందుల విక్రయాలు జరగడం, డాక్టర్ చీటీ లేకుండానే మందులు అందించడం, కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారులను నష్టపరచడం, కల్తీ ఔషధాల నియంత్రణలో వైఫల్యం వంటి సమస్యలపై ఈ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు వినియోగిస్తున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె. రాజేందర్, కోశాధికారి పోలు సతీష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లోని సుమారు 650 మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిట్టల శ్రీనివాస్, ఎన్. కరుణాకర్ రెడ్డి, విష్ణుమూర్తి, కోటగిరి వాసు, సంతోష్, అశోక్, మార్గాచారి, రాజేందర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending