News
జివిటీసీ లో పనిచేయని ఫ్రిడ్జ్.. చల్లటి తాగునీరు లేక ఇబ్బందులు
ఆర్జీ-1 ఏరియాలోని జీవీటీసీ (జీవీటీసీ ) కేంద్రంలో గత కొన్ని నెలలుగా ఫ్రిడ్జ్ పనిచేయకపోవడంతో కార్మికులు, ట్రైనింగ్‌కు వచ్చే అభ్యర్థులు,ఇతరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో చల్లటి తాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడికి వచ్చే వారు అలమటిస్తున్నారని తెలిపారు.
ఈ సమస్యపై స్పందించిన సీఐటీయూ యంగ్ వర్కర్స్ కమిటీ నాయకులు, వెంటనే పనిచేయకుండా ఉన్న ఫ్రిడ్జ్‌కు మరమ్మత్తులు చేపట్టి కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించే చర్యలు తీసుకోవాలని కోరారు.
News
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ : సీపీ అంబర్ కిషోర్ ఝా
బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపు
బిబిఎంఏ న్యూస్ / గోదావరిఖని మే 16
పెద్దపల్లి జిల్లాలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు మద్దతుగా శనివారం పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 12.40 లక్షల మెడికల్ షాపులు, ఫార్మసీలు బంద్‌లో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు.
ఆన్‌లైన్‌లో నియంత్రణ లేకుండా మందుల విక్రయాలు జరగడం, డాక్టర్ చీటీ లేకుండానే మందులు అందించడం, కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారులను నష్టపరచడం, కల్తీ ఔషధాల నియంత్రణలో వైఫల్యం వంటి సమస్యలపై ఈ బంద్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను పలుమార్లు వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం. వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె. రాజేందర్, కోశాధికారి పోలు సతీష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లోని సుమారు 650 మెడికల్ షాపులు బంద్‌లో పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిట్టల శ్రీనివాస్, ఎన్. కరుణాకర్ రెడ్డి, విష్ణుమూర్తి, కోటగిరి వాసు, సంతోష్, అశోక్, మార్గాచారి, రాజేందర్, సత్యనారాయణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
News
ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణే ధ్యేయం
బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున బస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించి, కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నిర్మూలన సాధ్యమని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలనీల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 20 మంది పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-
crime7 days agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News3 days agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News4 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
News4 weeks agoస్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొన్న వ్యాన్… అక్కడికక్కడే మృతి
-
Entertainment1 week agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime7 days agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime4 days agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
