Police News
POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
POLICE E:NEWS BBMA// సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
జిల్లా పోలీస్ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కొండాపూర్ మండలం అలియాబాద్, కంది గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఎఎస్., జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్. కలిసి సందర్శించారు. రైతులకు ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అండగా నిలవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భద్రతా పరమైన ఏర్పాట్లకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా రవాణా వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణలో విక్రయించకుండా చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు శాంతిభద్రతల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News
ఫేక్ లింకులు, ఆన్‌లైన్ మోసాలకు దూరంగా ఉండాలి : ఎస్ఐ ఉదయ్ కుమార్
అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలి – జగిత్యాల పోలీసులు
బిబిఎంఏ న్యూస్ /ఎండపల్లి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఓటీపీలు ఇతరులతో పంచుకోవడం, ఫేక్ లింకులు క్లిక్ చేయడం, సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు, ఆన్‌లైన్ లోన్లు, ఫేక్ జాబ్ ఆఫర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని తెలిపారు.
యువతలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుతోందని, వాటి వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పోలీస్ కళాబృందం ప్రత్యేక ప్రదర్శనలు, పాటల ద్వారా సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రాత్రివేళల్లో దొంగతనాల నివారణ, మహిళలు, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
News
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ : సీపీ అంబర్ కిషోర్ ఝా
బిబిఎంఏ న్యూస్ / మంచిర్యాల
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లు, భరోసా సెంటర్లు నిరంతరం పనిచేస్తున్నాయని తెలిపారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News
ప్రజల భద్రతే లక్ష్యం.. నేరాల నియంత్రణే ధ్యేయం
బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా బెల్లంపల్లి 1 టౌన్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున బస్తీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించి, కొత్తగా వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నిర్మూలన సాధ్యమని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
అపరిచితులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కాలనీల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో 20 మంది పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-
crime1 week agoప్రేమ వివాదం ముదిరి హత్య ముగ్గురు అరెస్ట్
-
News4 days agoఎస్ హెచ్ –7 పై వరుస ప్రమాదాలు – ఫోర్‌లేన్ విస్తరణకు డిమాండ్
-
News3 weeks agoకవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన” టిఆర్ఎస్
-
News4 weeks agoనేటి నుండి ఆర్ టి సి సమ్మె
-
Entertainment1 week agoనేడు విజయ్ తళపతి సిఎం ప్రమాణస్వీకారం
-
crime1 week agoబీటెక్ విద్యార్థి హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు
-
crime5 days agoచర్లపల్లిలో యువకుడి అనుమానాస్పద మృతి..
-
News2 weeks agoకొత్తూరులో రైతుల రాస్తారోకో… వరి తూకంలో మోసాలపై ఆగ్రహం
