Connect with us
🏢 Section-8 Company
📜 Regd. No: U88900 TS2023NPL174386
🪪 PAN: AALCB7180N

Telangana

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

Published

on

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

ప్రియమైన *తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి TMRPS నాయకులకు* హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు.

 

ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత *కీర్తి శేషులు అందేశ్రీ గారి* సంతాప సభ రేపు అనగా *22-11-2025 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు* హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో జరుగుతుంది.

 

గౌరవ మంత్రి వర్యులు

*శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో* జరిగే ఈ కార్యక్రమానికి

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

*శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు* ముఖ్యఅతిది గా హాజరు అవుతారు.

 

రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, కవులు కళాకారులూ అందరూ విచ్చేయుచున్నారు.

 

కావున ఈ కార్యక్రమం లో పాల్గొని ఆ మహాకవి కి నివాళి అర్పిచడం తో పాటు మన ఐక్యత చాటగలరని కోరుతున్నాం.

 

*తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిTMRPS*

*తెలంగాణ రాష్ట్ర కమిటీ*

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

Published

on

బక్రీద్ నేపథ్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం

పశువుల అక్రమ రవాణా, మావోయిస్టు కదలికలపై ప్రత్యేక నిఘా

జైపూర్, బిబిఎంఏ న్యూస్, మే 12:

రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా నివారణ, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు హాజరై పలు కీలక అంశాలపై చర్చించారు.

బక్రీద్ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా, మతపరమైన ఉద్రిక్తతలు, నేర సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, నాకాబందీలను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ పశువుల రవాణాకు పాల్పడేవారిపై కఠిన కేసులు నమోదు చేయడంతో పాటు సహకరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

అక్రమ ధాన్యం (వడ్లు) రవాణా, నకిలీ విత్తనాల విక్రయాల నివారణకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై నిరంతర సమాచార మార్పిడి కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Continue Reading

india

SRH దుమ్మురేపింది.. వరుసగా 4వ విజయం!

Published

on

SRH జోరు.. వరుసగా నాలుగో విజయం, పాయింట్ల పట్టికలో మూడో స్థానం

సన్ రైజర్స్ హైదరాబాద్మ రోసారి తమ ఆధిపత్యాన్ని చాటుతూ రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించడం SRH బ్యాటింగ్ శక్తిని స్పష్టంగా చూపించింది. ఈ విజయంతో జట్టు వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసి, ఈ సీజన్‌లో మొత్తం ఐదో విజయాన్ని అందుకుంది.

చేస్‌లో ఓపెనర్ ఇషాంత్కి షన్అ ద్భుతంగా ఆడి 74 పరుగులతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ 57 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మధ్యలో నితీష్ కుమార్ రెడ్డి 36 పరుగులతో వేగాన్ని కొనసాగించాడు. ట్రావిస్హె డ్ 6, హెయినరీచ్ క్లాసేన 29 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకోవడంలో పాత్ర పోషించారు.

మొత్తంగా బ్యాటింగ్ యూనిట్ సమిష్టిగా రాణించడంతో SRH సులభంగా విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో RR పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఫలితంతో SRH పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా, RRకి ఈ సీజన్‌లో మూడో ఓటమి ఎదురైంది.

ఈ విజయంతో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది.

Continue Reading

Telangana

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

Published

on

By

కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో “శుక్రవారం సభ” జరిగింది.

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్సందర్భంగా వారు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం సభ ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళకు పిల్లల పోషణ, ఆరోగ్యంపై పూర్తి అవగాహన వస్తోందని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య మహిళ ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు.

Continue Reading

Trending